Monday, 13 July 2020

సోషల్ మీడియా ✍(సామాన్యుడి చేతికి అందిన ఆయుధం)

నేడు సోషల్ మీడియా డే..✍
(సామాన్యుడి చేతికి అందిన ఆయుధం) 
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

★ సోషల్ మీడియా.. సమీప చరిత్రలో ఓ సంచలనం. ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మాధ్యమం. సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన మాధ్యమం.
■ ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాదే రోజువారి జీవితంలో కీలక సాధనంగా మారింది. సమాచార మార్పిడి మొదలై భావప్రకటన స్వేచ్ఛకు ఆయుధంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమం నిత్యజీవితంలో ఎంత ప్రభావ వంతంగా ఉందో చర్చించేందుకు జూన్ 30న ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
■ జాస్మిన్ విప్లవం.. గడిచిన దశాబ్ధంలో ప్రపంచ పటంలో సంభవించిన పెనుమార్పు పేరు. ఒక్క ఫేస్‌బుక్ పోస్ట్ ఈజిప్టులో అధికార మార్పిడికి కారణమైంది. లక్షలాది మంది ప్రజల్ని వీధుల్లోకి నడిపించింది. లోలోన దాగిన నిరసన జ్వాలను పెల్లుబికే లావాలా మలిచిన ఘనత సోషల్ మీడియాది. మంచి- చెడు, ఆనందం- విషాదం, ఉద్యమం - ఉద్వేగం, కసి - కన్నీళ్లు అన్నింటికీ సోషల్ మీడియా వేదికవుతోంది. ప్రపంచ గమనంలో కీలకస్థానాన్ని కైవసం చేసుకుంటోంది.

☄సాంకేతిక విప్లవం..
◆ నిజానికి సాంకేతికరంగంలో సాధించిన ప్రగతికి సోషల్ మీడియా ఓ సజీవసాక్ష్యం. సమాచార మార్పిడికి ఉత్తరాలపై ఆధారపడిన కాలం నుంచి టెలిగ్రామ్, టెలిఫోన్, సెల్‌ఫోన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే సమాచార మాధ్యమాల్లో రేడియో, టీవీ, పత్రికల స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. ఇది ప్రపంచాన్ని డిజిటల్ యుగంగా మార్చిన దశ. ఇంటర్నెట్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాల స్థానంలో మొయిల్స్ వచ్చాయి. టెలిగ్రామ్‌ల స్థానంలో మెసేజ్‌లు వచ్చాయి. క్రమంగా అది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్ట్‌ఇన్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల వరకు విస్తరించింది. ఇవే ఇప్పుడు సమాచార మార్పిడిలో కీలకంగా మారాయి.

☄భావ ప్రకటన స్వేచ్ఛ..🗣
◆మ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కును ప్రజలు సోషల్ మీడియా ద్వారా నిలబెట్టుకుంటున్నారు.ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడుతున్న మాధ్యమం సోషల్ మీడియా. దాన్ని ఎంతమంది వినియోగించు కోగలుగుతున్నారనే ప్రశ్న ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు రాజ్యం జోక్యం చేసుకుంటున్నప్పటికీ ప్రజలు స్వేచ్చగా తమ అభిప్రాయాల్ని ప్రకటించగలుగుతున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటున్నారు. సాంప్రదాయ వార్తపత్రికలు, ఛానళ్లు కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నా యన్న విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత దశలో సామాన్యుడు తన అభిప్రాయాల్ని వెల్లడించడానికి ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్,వాట్సప్ వంటి సామాజిక మాధ్యమా లను వేదికగా మార్చుకుంటున్నాడు.

☄సామాన్యుడి చేతి ఆయుధంలా..
■ వేగం సోషల్ మీడియా ప్రత్యేకత. ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియా దోహదపడుతోంది. ఈ విషయంలో వార్త ప్రసార సాధనాలను వెనక్కినెట్టి మరీ సోషల్ మీడియా దూసుకుపోతోందనడంలో అతిశయోక్తిలేదు. అంతే.. రాజకీయ, సామాజిక విషయాలపై సామాన్యుడు సైతం తన అభిప్రాయాల్ని వెల్లడించేందుకు సోషల్ మీడియా మాధ్యమాలు వేదికగా నిలుస్తున్నాయి. అందుకే.. అనేక సామాజిక, రాజకీయ ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారా భావ ప్రచారం కొనసాగిస్తుండడం గమనించవచ్చు. తెలంగాణ వంటి ఉద్యమాలే అందుకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో డిజిటల్ మీడియాది కీలక పాత్ర. ప్రతిఘాతుక శక్తుల కుయుక్తులను ఎప్పటికప్పడు ఎండగట్టడంలో సోషల్ మీడియా సహకారం చెప్పుకొదగింది. అంతేకాదు.. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఫేస్‌బుక్‌లో వేలాది గ్రూప్‌లు సృజనాత్మక ప్రక్రియల పురోగతి కోసం పనిచేస్తుండడం గమనించవచ్చు.

☄దుష్ప్రభావాలు సైతం..
■ సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగముందో అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సమాచార మార్పిడి, భావజాల ప్రచారం కోసం వినియోగించేవారు కొందరైతే.. కొందరు దుర్వినియోగం చేస్తుండడం కూడా గమనించవచ్చు. వ్యక్తిగత దుష్ప్రచారం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం వంటివి ఇందులో భాగమే. సోషల్ మీడియా వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు సెక్సువల్ అబ్యూజ్‌కి గురైన సందర్భాలు లేకపోలేదు. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో సైతం సంబంధాలు ఏర్పడడుతుండడంతో వాళ్లని నమ్మి మోసపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉంటా రు. ఇలా సైబర్ క్రైం శాతం పెరిగింది కూడా కాదనలేని నిజం. ప్రభుత్వం, ఇంటర్నెట్ ప్రొవెడైర్స్, సామాజిక మాధ్యమ సంస్థలు ఉమ్మడిగా... ఆన్‌లైన్ మీడియాపై విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే.. సాంకేతిక ప్రగతికి అర్థం ఉంటుంది.

*☄సోషల్ మీడియా డే..
■ సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది. వాటిని సక్రమంగా వినియోగిం చులేకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే.. సోషల్ మీడియా సాధనాలు - నిత్య జీవితంలో ప్రభావాలపై అవగాహన కోసం 2010లో మాషబుల్ సోషల్ మీడియా డే ని ప్రారంభించింది. అలా మొదలైన సామాజిక మాధ్యమాల దినోత్సవం క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం మొదలైంది. అందులో భాగంగా 7వ సోషల్ మీడియాడేని నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నెటిజన్లు నిర్వహించుకుంటున్నారు.
★ప్రభుత్వం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, అధికార గణం... ఇవన్నీ దేశం చక్కగ నడవటానికి మూల కారణాలు. అయితే, వీటికి ఎప్పుడూ తోడుగా వుంటూ వస్తోంది మీడియా.అలాంటి సామాజిక మాధ్యమంలో ఇప్పుడు ప్రజాస్వామ్యానికి సోషల్ మీడియా ఐదవ స్తంభంగా ఆవిర్భవిస్తోందంటే అతిశయోక్తి కాదు.

తెలుగు వర్ణమాలలో కరోనా

:తెలుగు వర్ణమాలలో కరోనా:

*అ* క్కడెక్కడో పుట్టింది 
*ఆ* పదలో పడేసింది
*ఇ* టలీకి వెళ్ళింది 
*ఈ* జిప్టుకు పాకింది 
*ఉ* ధృతంగా పెరిగింది 
*ఊ* చకోత కోస్తోంది
*ఋ* క్కులకే లొంగనంది 
*ఎ* ప్పుడు వస్తానో చెప్పనంది
*ఏ* డిపించుకుతింటోంది 
*ఐ* శ్వర్యానికి లొంగనంది 
*ఒ* క్కోదేశానికి అంటుతోంది
*ఓ* డలు విమానాలను ఆపేయించింది
*ఔ* షధాలే లేవంది 
*అం* దరికీ వ్యాపిస్తోంది 
*అః* కఃనః అన్నట్లుంది (అర్థం కానట్టు ఉంది)
*క* రోనా తన పేరందిి 
*ఖ* నిత్రం లా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం' పలుగు)
*గ* రిష్ఠంగా పెరుగుతోంది 
*ఘ* నుడు సామాన్యుడని చూడనంది
*ఙ* వలే తెలియనంది
*చ* టుక్కున అంటుకుంటుంది 
*ఛ* రఖాలా తిరుగుతోంది 
*జ* బ్బుల్లో పెద్దదయింది 
*ఝం* డా ఎగరేస్తోంది 
*ఞ*! ఆ! యా! అని వెక్కిరిస్తోంది
*ట* క్కుడెక్కులు చూపిస్తోంది
*ఠ* క్కున అంటుకుంటుంది 
*డ* బ్బులకు లొంగనంది 
*ఢ* మరుకం మోగిస్తోంది 
*ణ* లా బుద్ది వంకరది
*త* నకు ఎదురు లేదంటోంది 
*ద* య్యంలా పీడిస్తోంది 
*ధ* ర్మం న్యాయం తనకు లేవంది
*న* లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది
*ప* రుగులు పెట్టిస్తోంది
*ఫ* లితం లేదంటోంది
*బ* డులు గుడులు మూయించింది
*భ* యాన్ని ఇంకా పెంచుతోంది 
*మ* రణమృదంగం మోగిస్తోంది 
*య* ముని దగ్గరకు పంపిస్తోంది 
*ర* క్కసి లా తినేస్తోంది 
*ల* క్షలమందిని కబలిస్తోంది 
*వ* రదలా ముంచేస్తోంది 
*శ* నిలా దాపురించింది 
*ష* ట్కాలాల్లో కూడా తానుంటానంది
*స* బ్బునురగంటే భయమంటుంది
*హ* రించుటే తన గుణమంది
*ళ* ఇలా అంటూ అంటుకుంటోంది ('ళ' ను అల అని చదువుతుంటారు)
*క్ష* మించడం తన డిక్షనరీ లో లేదంది 
*ఱ* ౦పము లా కోసేస్తోంది
 
“ఇంట్లో ఉండండి-సురక్షితంగా ఉండండి”

భోజనం చేసే విధానము .

భోజనం  చేసే విధానము .

భోజనం బల్ల మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూ CVస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.  

తిండేదైనా ఫోర్క్ ఖచ్చితం అయి కూర్చుంది ఈ వేళ..? 

భోజనశాల లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.  

ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు. 

దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.  

అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే శాస్త్రీయ లాభాలను ఓ సారి చూద్దాం. 

ఇది చదివాక ఎక్కడున్నా…? 
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయి.

🍴🍴🍴🍴🍴🍴🍴

3.అహారాన్ని చేతితో  ముట్టుకో గానే, ఆహారం తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

🍴🍴🍴🍴🍴🍴🍴

6.మన ఆహారం లో నూనె  ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

7.వ్రేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

8.చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

9.ఇంకా చేతివ్రేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల ప్రకారంగా ....

*చేతిలో ఉండే ఒక్కో వ్రేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది.
🍽🍽🍽🍽🍽🍽🍽

*బొటన వ్రేలు: అగ్నితత్వం
--------------

*చూపుడు వ్రేలు: వాయుతత్వం
--------------

*మధ్యవ్రేలు: ఆకాశం
--------------
*ఉంగరపు వ్రేలు: భూమి
--------------
*చిటికిన వ్రేలు: జలతత్వం.. 
--------------
ఈ అయిదు వ్రేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.
🍃🍍🍎🌿🍐🍊🍑🍒🌽🍆🍌🍃
ఇది  నిజం .....


మోక్షానికి అర్హులెవ్వరు?

*👌మోక్షానికి అర్హులెవ్వరు?👌*
త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని.

 ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు.

 ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.

‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. 

వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.

స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.

విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. 

మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.
‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.

‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.

భగవంతుడిని పొందాలంటే    
కులంకాదు గుణము ముఖ్యము🙏

యూట్యూబ్ చాన‌ల్‌ ఎలా పెట్టాలి..?

యూట్యూబ్ చాన‌ల్‌ ఎలా పెట్టాలి..? 
*****************************
ఎంత సంపాదన..?
**************

ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ చాన‌ల్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం కూడా ఒక‌టి. చెప్పుకునేందుకు కొంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. 
అయితే ఏ ప‌నిలో అయినా శ్ర‌మ ప‌డాల్సిందే. యూట్యూబ్ చాన‌ల్ పెట్టేందుకు కొంత టెక్నిక‌ల్ నాలెడ్జ్ అవ‌స‌రం. కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్‌, సోష‌ల్ మీడియాపై ప‌ట్టు ఉండాలి. అలాగే సింపుల్ వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. దీనికి తోడు ఓపిక ఉండాలి. 

అయితే యూట్యూబ్ చాన‌ల్ ఎలా పెట్టాలి..? 
************************************
దానికి ఎంత వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది..? 
*****************************
ఎంత వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది..? 
***************************
వివ‌రాలు ఇప్పుడు ......

యూట్యూబ్ చాన‌ల్ పెట్టేందుకు ఒక్క జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. 
దాంతో యూట్యూబ్‌లోకి లాగిన్ అయి కొత్త‌గా చాన‌ల్ క్రియేట్ చేయ‌వ‌చ్చు. అయితే మీరు పెడుతున్న చాన‌ల్‌లో ఏ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు పెట్ట‌ద‌ల‌చుకున్నారో ముందుగానే అవ‌గాహ‌న ఉండాలి. అంటే.. 
ఉదాహ‌ర‌ణ‌కు.......
మీకు వంట చేయ‌డం బాగా వ‌చ్చ‌నుకుంటే.. 
ప‌లు ర‌కాల వంట‌ల‌ను చేస్తూ.. వాటిని వీడియో తీసి.. ఆయా వంట‌లు ఎలా చేయాలో వీడియోల్లో చెబుతూ.. 
ఆ వీడియోల‌ను యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేయాలి. అలాగ‌న్న‌మాట‌.. 

ఇక మీరు గేమింగ్ ప్రియులు అయితే.. 
ర‌క ర‌కాల గేమ్స్ ఆడుతూ వాటి వీడియోలు రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఇలా ర‌క ర‌కాల అంశాల‌కు సంబంధించి మీకున్న ప‌రిజ్ఞానం మేర వీడియోలు క్రియేట్ చేసి లేదా రికార్డు చేసి వాటిని యూట్యూబ్‌లో పెట్టి త‌ద్వారా వాటితో డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు.

అయితే మీరు పెట్టిన యూట్యూబ్ చాన‌ల్‌లో ఉండే కంటెంట్‌కు సంబంధించి వీడియోల‌కు గాను త‌గిన విధంగా టైటిల్స్‌, డిస్క్రిప్ష‌న్‌, కీ ట్యాగ్స్ ఇవ్వాలి. దీంతో యూట్యూబ్‌లో ఎవ‌రైనా ఆ అంశాల‌కు సంబంధించిన వీడియోల‌ను సెర్చ్ చేసిన‌ప్పుడు మీ వీడియోలు సెర్చ్ లిస్ట్‌లో మొద‌టి పేజీల్లో క‌నిపించేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా మీ వీడియోల‌కు ట్రాఫిక్ ఎక్కువ వ‌స్తుంది. ఇక షూట్ చేసిన వీడియోల‌ను ఎడిట్ చేసేందుకు పీసీలో, మొబైల్స్‌లో ప‌లు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని యూజ‌ర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్నింటిని లిమిటెడ్ ఫీచ‌ర్ల‌తో ఉచితంగా వాడుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

పీసీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ల‌లో.. 
అడోబ్ ప్రీమియ‌ర్ ప్రొ, ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్‌, పినాకిల్ స్టూడియో, సైబ‌ర్‌లింక్ ప‌వ‌ర్ డైరెక్ట‌ర్‌, కామ్‌టేసియా స్టూడియో.. వంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే మాక్ పీసీకి అయితే ఫైన‌ల్ క‌ట్ ప్రొ అందుబాటులో ఉంటుంది. ఇక మొబైల్‌కు అయితే ఫిల్మోరా, అడోబ్ ప్రీమియ‌ర్ క్ల‌బ్‌, ప‌వ‌ర్ డైరెక్ట‌ర్ వంటి వీడియో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఇక యూట్యూబ్ చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోల‌ను రికార్డ్ చేసేందుకు చ‌క్క‌ని డీఎస్ఎల్ఆర్ కెమెరాను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 
డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. రూ.60వేలు మొద‌లుకొని ఆ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అదే అంత పెట్టుబ‌డి ముందుగా ఎందుకు.. 
అనుకుంటే.. 
చ‌క్క‌ని కెమెరా కెపాసిటీ క‌లిగిన ఫోన్ల‌తోనూ వీడియోల‌ను షూట్ చేసి వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ చాన‌ల్‌లోకి అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.

ఇక ఎడిట్ చేసిన వీడియోల‌కు స‌ద‌రు సాఫ్ట్‌వేర్ల స‌హాయంతోనే మ్యూజిక్ యాడ్ చేయ‌వ‌చ్చు. అయితే అది కాపీ రైట్ మ్యూజిక్ అయి ఉండ‌కూడ‌దు. ఉచితంగా వాడుకునే మ్యూజిక్ అయి ఉండాలి. అలాంటి మ్యూజిక్ మీ వ‌ద్ద ఉంటే దాన్ని వీడియోల‌కు యాడ్ చేయ‌వ‌చ్చు. 

ఈ విష‌యంలో గూగుల్ త‌న యూట్యూబ్ స్టూడియోలో ఉచితంగా వాడుకునేందుకు ప‌లు మ్యూజిక్ ట్రాక్‌ల‌ను కూడా అందుబాటులో ఉంచింది. వాటిని యూజ‌ర్లు త‌మ వీడియోల‌కు యాడ్ చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక మ్యూజిక్ లేకుండా వాయిస్ ఓవ‌ర్ అయితే అందుకు నాణ్య‌మైన హెడ్‌ఫోన్స్‌ను (మైక్ ఉన్న‌వి) కొనాలి. వాటితో మీ వాయిస్ ఓవ‌ర్‌ను రికార్డు చేసి దాన్ని ఆ వీడియోల‌కు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా యాడ్ చేయ‌వ‌చ్చు.

అలా ఎడిటింగ్ పూర్త‌యిన వీడియోల‌ను నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. అయితే వాటికి థంబ్ నెయిల్స్ ఇచ్చేందుకు గాను ఫొటోషాప్‌లో చ‌క్క‌ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఫొటోషాప్ నేర్చుకోవాలి. అదేం అవ‌స‌రం లేద‌నుకుంటే.. ఆ వీడియోల‌ను నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.. వాటికి గాను థంబ్ నెయిల్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయి. వాటిలో ఏదైనా ఒక దాన్ని థంబ్ నెయిల్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇలా వీడియోల‌ను విజ‌య‌వంతంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.

అయితే వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ఆదాయం ఎలా వ‌స్తుంది..? 
అని కొంద‌రు ఆలోచిస్తారు. 
అది ఎలాగంటే.. 
యూట్యూబ్ త‌న యూజ‌ర్లు పెట్టే వీడియోల ద్వారా వ‌చ్చే ఆదాయంలో 55 శాతం షేర్‌ను యూజ‌ర్‌కు ఇస్తుంది. అంటే యూజ‌ర్ పెట్టిన ఒక వీడియో ద్వారా 1 రూపాయి ఆదాయం వచ్చింద‌నుకుంటే.. అందులో 55 పైస‌ల‌ను యూజ‌ర్‌కు వీడియో పెట్టినందుకు ఇస్తుంద‌న్న‌మాట‌. 

ఇక సాధార‌ణంగా యూట్యూబ్‌లో యూజ‌ర్లు పెట్టిన వీడియోల‌కు గాను ప్ర‌తి 1000 వ్యూస్‌కు 1 నుంచి 6 డాల‌ర్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. ఇది అనేక అంశాల‌పై ఆధార ప‌డి ఉంటుంది. వీడియోల‌ను చూసే వ్యూయ‌ర్లు ఉన్న ప్ర‌దేశం, అడ్వ‌ర్ట‌యిజ‌ర్ల ఆస‌క్తి, వారు యాడ్స్ ఇచ్చే రేటు త‌దిత‌ర అంశాల ఆధారంగా ఆ ఆదాయం వ‌స్తుంది. అది ఒక్కోసారి 1 డాల‌ర్ క‌న్నా త‌క్కువ‌గా కూడా ఉండ‌వ‌చ్చు. కానీ వారు ఇచ్చే యాడ్స్‌ను బ‌ట్టి, యూజ‌ర్ల వీడియోల‌కు వ‌చ్చే వ్యూస్‌ను బ‌ట్టి వారికి ఆ వీడియోల ద్వారా వ‌చ్చే ఆదాయం మారుతుంది.

యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి వాటిని వ్యూయ‌ర్స్ వీక్షిస్తారులే అని ఎదురు చూడ‌కూడ‌దు. యూట్యూబ్ చాన‌ల్ కొత్త‌గా పెట్టిన వారు దాని గురించి ప‌బ్లిసిటీ చేయాలి. ఫేస్‌బుక్‌, గూగుల్ త‌దిత‌ర అనేక ప్లాట్‌ఫాంల‌పై అవ‌స‌రం అయితే కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి యూట్యూబ్ చాన‌ల్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోవ‌చ్చు. అలా 1వేయి స‌బ్‌స్క్రైబ‌ర్లు అయితే యూట్యూబ్ ఆ యూజ‌ర్‌కు గూగుల్‌ యాడ్‌సెన్స్ అకౌంట్‌ను ఇస్తుంది. ఇక‌ అప్ప‌టి నుంచి యూట్యూబ్‌లో యూజ‌ర్లు పెట్టే వీడియోల‌కు యాడ్స్‌ను బ‌ట్టి ఆదాయం వ‌స్తుంటుంది. ఇక వీడియోల‌ను చూసే వారి నుంచి డొనేష‌న్ల‌ను స్వీక‌రించ‌డం కోసం సూప‌ర్ చాట్ కూడా ఎనేబుల్ అవుతుంది. అందుకు కూడా యూట్యూబ్ చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య 1000 దాటాలి.

యూట్యూబ్ చాన‌ల్ పాపుల‌ర్ అయ్యే కొద్దీ అందులో ఉన్న వీడియోల‌కు వ‌చ్చే రెవెన్యూ కూడా పెరుగుతుంది. చాన‌ల్ పాపుల‌ర్ అవుతుంది కాబ‌ట్టి అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు ఆ చాన‌ల్‌లో పెట్టే వీడియోల‌కు యాడ్స్ ఇచ్చేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. దీంతో యాడ్ రేట్ ఎక్కువ‌వుతుంది. అలా వీడియోల‌కు ఎక్కువ రేటు చెల్లిస్తారు. దీంతో యూజర్ల‌కు అప్పుడు ఎక్కువ ఆదాయం వ‌స్తుంది. అలా చాన‌ల్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరుగుతూ.. పాపుల‌ర్ అయ్యేకొద్దీ.. దానికి వ‌చ్చే ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. అయితే ఈ తంతు అంతా జ‌రిగేందుకు స‌హ‌జంగానే చాలా ఎక్కువ కాలం ప‌డుతుంది. అయితే డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. త‌క్కువ కాలంలోనే యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఎక్కువ మొత్తంలో డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు.

ఇక యూట్యూబ్ చాన‌ల్‌లో వీడియోల‌కు గూగుల్ ఇచ్చే యాడ్స్ మాత్ర‌మే కాకుండా యూజ‌ర్ త‌న పాపులారిటీని బ‌ట్టి త‌న‌కు తెలిసిన కంపెనీల‌తో టై అప్ అయ్యి.. వారి కంపెనీకి చెందిన ప్రొడ‌క్ట్స్‌, సేవ‌ల‌ను ప్ర‌మోట్ చేస్తూ త‌మ వీడియోల‌లో స్పాన్స‌ర్‌షిప్ లింక్‌లు, యాడ్ లింక్‌లు పెట్ట‌వ‌చ్చు. వారి ప్రొడ‌క్ట్స్‌ను ప్ర‌మోట్ చేయ‌వ‌చ్చు. ఇలా కూడా యూజ‌ర్లు త‌మ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. 

అలాగే ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు చెందిన వెబ్‌సైట్ల‌లో ఉండే ప్రొడ‌క్ట్స్‌ను చాన‌ల్ ద్వారా అమ్ముతూ.. అఫిలియేట్ విధానంలో ఆ అమ్మ‌కాల‌కు క‌మిష‌న్లు కూడా పొంద‌వ‌చ్చు. చాన‌ల్‌లోని వీడియోల కింద డిస్క్రిప్ష‌న్‌లో స‌ద‌రు ప్రొడ‌క్ట్స్‌కు చెందిన సేల్స్ లింక్‌ల‌ను ఇవ్వ‌డం ద్వారా వ్యూయ‌ర్లు నేరుగా అక్క‌డి నుంచే త‌మ‌కు కావ‌ల్సిన ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేసేలా స‌దుపాయం క‌ల్పించ‌వ‌చ్చు. దీంతో వారు కొనుగోలు చేసే వ‌స్తువుల‌ను బ‌ట్టి.. ఒక్కో కొనుగోలుపై నిర్దిష్ట‌మైన మొత్తంలో క‌మిష‌న్ పొంద‌వ‌చ్చు. ఆ మొత్తాన్ని ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు మీకు పేమెంట్ కింద చెల్లిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ త‌దిత‌ర వెబ్‌సైట్లు ఇలా అఫిలియేట్ ప‌ద్ధ‌తిలో క‌మిష‌న్లు పొందే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

అయితే యూట్యూబ్ చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసే ఏ వీడియో అయినా స‌రే.. కనీసం 30 సెక‌న్ల నిడివి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దానికి యాడ్స్ వ‌స్తాయి. 
అలాగే 
వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నాం క‌దా.. 
వ్యూస్ రావ‌డం లేదేంటి..? అని కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఆరంభంలో అలాగే ఉంటుంది. కానీ ఆ వీడియోలు పాపుల‌ర్ అయితే.. అప్పుడు మీరు వ‌ద్ద‌న్నా వాటికి ఎడా పెడా వ్యూస్ వ‌స్తుంటాయి. అలా వ్యూస్ వ‌చ్చేలా చేసుకోవాల్సిన టెక్నిక్ అంతా మీ వ‌ద్దే ఉంటుంది. మీరు ఎంత చ‌క్కటి కంటెంట్‌తో వీడియోల‌ను యూట్యూబ్ చాన‌ల్‌లో పెడితే.. అంత ఎక్కువ‌గా వ్యూస్ వ‌చ్చి.. మీ చాన‌ల్ అంత పాపుల‌ర్ అవుతుంది. అందుకు ఎవ‌రైనా స‌రే.. 
కొంచెం శ్ర‌మించాల్సిందే.. 

అవును.. 
క‌ష్ట‌ప‌డ‌కపోతే మ‌నం మ‌న ల‌క్ష్యాన్ని చేరుకోలేం క‌దా.. ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌నుకునేవారు, అందులోనూ యూట్యూబ్ చాన‌ల్‌నే స్వ‌యం ఉపాధిగా మార్చుకోవాల‌నుకునే వారు.. ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మిస్తే.. కొంత స‌మ‌యం ప‌ట్టినా.. విజ‌యం త‌ప్ప‌క వ‌రిస్తుంది. మ‌రింకెందుకాల‌స్యం.. 
వినూత్న రీతిలో.. 
మీదైన శైలిలో వీడియోల‌ను క్రియేట్ చేసి పెట్టే స‌త్తా మీలో ఉంటే.. వెంట‌నే సొంతంగా యూట్యూబ్ చాన‌ల్ ప్రారంభించండి మ‌రి..!

వి హేల్ప్ పీపుల్.....

Saturday, 23 May 2020

💢 *నిత్య పారాయణ శ్లోకాలు* 💢ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలి ?

💢 *నిత్య పారాయణ శ్లోకాలు* 💢

ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలి ?
 
🌷 *ప్రభాత శ్లోకం* :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
 
☘ *ప్రభాత భూమి శ్లోకం* : ☘
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
 
🌝 *సూర్యోదయ శ్లోకం* : 🌝
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!
 
🍀 *స్నాన శ్లోకం* : ☘
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!
 
♨ *భస్మ ధారణ శ్లోకం* : ♨
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!
 
🍀 *భోజనపూర్వ శ్లోకం* : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
 
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
 
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
 
💢 *భోజనానంతర శ్లోకం* : 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

🌷 *సంధ్యా దీప దర్శన శ్లోకం* :🌷
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!
 
😔 *నిద్రా శ్లోకం* :😔
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!
 
👍 *కార్య ప్రారంభ శ్లోకం* : 👍
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
 
🌷 *హనుమ స్తోత్రం* : 🌷
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
 
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!
 
💢 *శ్రీరామ స్తోత్రం* : 💢
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 
 
♨ *గణేశ స్తోత్రం* : ♨
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!
 
🔯 *శివ స్తోత్రం* : 🔯
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!
 
🕉 *గురు శ్లోకం* : 🕉
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!
 
☸ *సరస్వతీ శ్లోకం* :☸
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
 
 యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
 
🌷 *లక్ష్మీ శ్లోకం* 🌷: 
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

☘ *వెంకటేశ్వర శ్లోకం* ☘: 
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!
 
♨ *దేవీ శ్లోకమ్* ♨ : 
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!
 
💢 *దక్షిణామూర్తి శ్లోకం* 💢 : 
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!
 
☸ *అపరాధ క్షమాపణ స్తోత్రం*
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
 
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ 
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
 
కాయేన వాచా మనసేంద్రియైర్వా 
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి !!

Saturday, 18 April 2020

Lock down time lo ఏం వండుకోవాలా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ list follow అయ్యిపోతే సరి...కుదిరితే అన్నీ ఒకోటీ వేయించుకుని చేసుకుని తినండి .. 🙏💐💐💐🙏

*తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా ?*

మినపట్టు
పెసరట్టు 
రవ్వట్టు
పేపర్ దోసె
మసాల దోసె
ఉల్లి దోసె 
రాగి దోశ
చీజ్ పాలక దోశ
కొబ్బరి అట్టు
గోధుమ అట్టు
అటుకుల అట్టు
సగ్గుబియ్యం అట్టు
బియ్యపు పిండి అట్లు
పుల్లట్టు
ఊతప్పం
పులి బొంగరం
ఉప్మా అట్టు
ఇడ్లీ 
మసాల ఇడ్లీ
రవ్వ ఇడ్లీ
సాంబార్ ఇడ్లి
ఆవిరి కుడుము
మసాలా ఉప్మా
బొంబాయి రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా
సేమ్యా ఉప్మా
టమోటా బాత్
ఇడ్లీ ఉప్మా
బియ్యపు రవ్వ ఉప్మా
నూకలుప్మా
మరమరాల ఉప్మా
కొబ్బరి ఉప్మా
అటుకుల ఉప్మా
ఉప్పిడి పిండి
పూరి
చపాతి
వడ
సాంబారు వడ
పప్పు పొంగలి 
కంచి పులిహోర
నిమ్మ పులిహోర
కొబ్బరి అన్నం
పుదీనా పులావ్
బిర్యాని
దధ్యోదనం
చక్రపొంగలి
కట్టుపొంగలి
వెజ్ ఫ్రైడ్ రైస్
జీరా రైస్
పులగం
ఉల్లిపాయ చట్నీ
ఎండుమిరపకాయ చట్నీ
కొబ్బరి చట్నీ
మినప చట్నీ
వేరుశనగపప్పు చట్నీ
శనగపప్పు చట్నీ
శనగపిండి చట్నీ (బొంబాయిచట్నీ)
శనగపప్పు పొడి
ధనియాల పొడి
కొబ్బరి పొడి
నువ్వుల పొడి
వెల్లుల్లిపాయ కారప్పొడి
కరివేపాకు పొడి
కందిపొడి
మునగాకు చట్నీ 
గుమ్మడి చట్నీ 
అటుకుల పులిహార
చింతపండు పులిహార
నిమ్మకాయ పులిహార
మామిడికాయ పులిహార
రవ్వ పులిహార
సేమ్యా పులిహార
ఆలు పరోట
చపాతి
పరోట
పుల్కా
పూరి & సాగు
రుమాల్  రోటీ
కాలీఫ్లవర్ పరోటాలు
పాలక్ పన్నీర్
కొత్తరకం పూరీలు
ముద్దపప్పు
దోసకాయ పప్పు
బీరకాయ పప్పు
టమోటా పప్పు
మామిడి కాయ పప్పు
తోటకూర పప్పు
గుమ్మడి పప్పు 
చింత చిగురు పప్పు
కంది పచ్చడి
కొబ్బరి పచ్చడి
క్యాబేజి పచ్చడి
క్యారెట్ పచ్చడి
దొండకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి 
బీరకాయ తొక్కు పచ్చడి
బెండకాయ పచ్చడి
మామిడికాయ పచ్చడి
వంకాయ పచ్చడి
వెలక్కాయ పచ్చడి
టమోటా పచ్చడి
మెంతికూర పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
బీరకాయ పచ్చడి
సాంబారు
సాంబారు పొడి
పులుసు (తీపి)
పొట్ల కాయ పులుసు
సొరకాయ పులుసు
మజ్జిగ పులుసు
పప్పు పులుసు
ఉల్లిపాయ పకోడి
క్యాబేజి పకోడి
గోధుమ పిండి పకోడి
పాలక్ - పకోడి (పాలకూర పకోడి)
బియ్యపు పిండి పకోడి
మసాల పకోడి
మెత్తటి పకోడి
బ్రెడ్ పకోడి
పల్లీ పకోడీలు 
సేమ్యా పకోడి
కాలీఫ్లవర్‌ పకోడి
ఆలూ పకోడి
ఖాండ్వీ
అటుకుల పోణీ
అప్పడం బజ్జి
అరిటికాయ బజ్జి
ఉల్లిపాయ బజ్జి
టమటా బజ్జి
బంగాళదుంప బజ్జి
బీరకాయ బజ్జి 
బ్రెడ్ బజ్జి
మిరపకాయ బజ్జి 
వంకాయ బజ్జి
క్యాప్సికమ్ బజ్జి
కొర్ర బజ్జీ
గుమ్మడికాయ బజ్జీలు
దోసకాయ బజ్జి
గుంట పునుగులు
పునుగులు
మైసూర్  బోండ
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
మసాల గారె
నేతి గారె
పప్పు వడ
మసాల వడ
వెజిటబుల్ వడ
పెసర గారెలు
మినపచెక్క వడలు
సగ్గుబియ్యం బోండా
బఠాణీ బోండా
పచ్చి బఠానీ బోండాలు
మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి)
ఉసిరి ఆవకాయ
ఉసిరికాయ పచ్చడి
కాకరకాయ పచ్చడి
కొత్తిమీర పచ్చడి
గోంగూర పచ్చడి
చింతకాయ పచ్చడి
టమోటా పచ్చడి
దబ్బకాయ ఊరగాయ
పండు మిరపకాయల పచ్చడి
మామిడికాయ ఆవకాయ
మామిడికాయ తురుంపచ్చడి
మామిడికాయ (మాగాయ)
ముక్కల పచ్చడి
మునక్కాయ ఆవకాయ
పెసర ఆవకాయ
కాలీఫ్లవర్ పచ్చడి
చిలగడదుంపల పచ్చడి 
క్యాబేజీ ఊరగాయ
వంకాయ పచ్చడి
నిమ్మకాయ ఊరగాయ
వెల్లుల్లి పచ్చడి 
కాజాలు
బూంది 
చక్రాలు
కారప్పూస
చెగోడి
చెక్కలు
తపాళ చెక్కలు
పెసర చెక్కలు
చెక్క పకోడి
పెరుగు చక్రాలు
సగ్గుబియ్యం చక్రాలు
శనగపప్పు చక్రాలు
వాంపూస
గవ్వలు
ఆలూ చిప్స్
బనానా చిప్స్
మసాల బీన్స్ 
కారం చెక్కలు
అలూతో చక్రాలు 
కొబ్బరి చెక్కలు 
జొన్న మురుకులు
మైదా కారా (మైదాచిప్స్)
వెన్న ఉండలు
పన్నీర్ చట్ పట్
సోయా సమోస, సమోస
చిలకడ దుంప చిప్స్
కాకరకాయ చిప్స్
జంతికలు
గుమ్మడి వరుగు (చిప్స్)
అరిసెలు
బూరెలు
కొబ్బరి బూరెలు 
పచ్చి బూరెలు 
తైదు బూరెలు
మైదాపిండితో పాల బూరెలు 
సజ్జ బూరెలు
గోధుమ బూరెలు
చలిమిడి
కొబ్బరి పూర్ణాలు 
గోధుమ పిండితో పూర్ణాలు 
పూతరేకులు
జొన్న బూరెలు
బూంది లడ్డు
రవ్వ లడ్డు
తొక్కుడు లడ్డు
మినప ముద్దలు
సున్నుండలు
బాదుషా
మడత కాజా
తీపి కాజాలు
మైసుర్ పాకు
జాంగ్రి
పూస మిఠాయి
కోవా
కజ్జి కాయలు
తీపి గవ్వలు
జీడిపప్పు పాకం
శనగపప్పు పాకం
వేరుశనగపప్పు ముద్దలు
మరమరాల ముద్దలు
డ్రైఫ్రూట్స్ హల్వా
నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద)
కోవా కజ్జికాయ
మిల్క్ మైసూర్‌ పాక్
కాజు క్యారెట్
బటర్ బర్ఫీ
కిస్‌మిస్ కలాకండ్
బూంది మిఠాయి
పాపిడి
చాంద్ బిస్కట్స్
ఖర్జూరం స్వీట్
సేమ్యాతో అరిసెలు
కొబ్బరి ఖర్జూరం
బాదంపాకము 
బాంబే హల్వ

Wednesday, 15 April 2020

*🔥గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా..🔥

*🔥గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా..🔥

■ సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన.సాహితీ వ్యాసంగం లోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.

*■ ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.*

*☀జీవిత విశేషాలు..*

*

*■ వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న  రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.*

■వీరేశలింగానికి నాలుగేళ్ళవయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం,రుక్మిణీ కళ్యాణం,  సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతుల లోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. 

■ తన పదమూడో యేట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.

*■ చదువుకునే రోజుల్లో [ కేశుబ్ చంద్ర సేన్] రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యా డు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.*

*■1867లో పెదనాన్న మరణంతో ప్రభుత్వో ద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యో గం చెయ్యకూడ దని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి,  న్యాయవాద వృత్తి చేపడదామ ని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.*

*■ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874  అక్టోబరులో " వివేకవర్ధని" అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవక లను ఎత్తి చూపడం,దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతి ని ఎత్తి చూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.*

■ కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన  కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.

*■ ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజం స్థాపించాడు.  యువజన సంఘాల స్థాపన కూడా వీరేశ లింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సం"ల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.*

*🌟సంఘ సంస్కరణ కార్యక్రమాలు..*

**■ సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు.*

*■ వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు.* 

■ ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చో బెట్టేవాడు.వారికి ఉచితంగా చదువుచెప్పడం తో బాటు,  పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.

*■ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు.*

*■ స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే
 పత్రికను కూడా నడిపాడు.*

*■ వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.*

■ ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమా లొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లల కు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోక ముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 

■ 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ  తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు.

*☄విప్లవాత్మకమైన మార్పు..*

◆ చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష, సాహసము, విజ్ఞాన తృష్ణలు.

◆ రామమోహనరాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ల బోధనలు, రచనలు ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చాడు. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజము స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవం ప్రారంభించాడు. ఆయన మూఢ విశ్వాస ములు, సనాతనాచారములపై జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది.

*📜🖋సాహితీ వ్యాసంగం:*

■సంఘసేవలో వీరేశలింగం ఎంతకృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభ శైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల లో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.

◆ ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల,  సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. 

◆ అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

◆ సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

*🌟కందుకూరి రచనల జాబితా:*

*

*☀నాటకాలు..*
*◆ చమత్కార రత్నావళి:* "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" అనే షేక్స్‌పియర్ నాటకాన్ని తెలుగులో వ్రాసి విద్యార్థులచే ప్రదర్శింపజేశాడు.కాళిదాసు శాకుంతలం-తెలుగులో రత్నావళి - సంస్కృత రూపకానువాదందక్షిణ గోగ్రహణంసత్య హరిశ్చంద్రమాళవికాగ్ని మిత్రము వంటి 12 నాటకాలు

*☀నవలలు..*
*◆ రాజశేఖర చరిత్రము:* తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. 

*◆ సత్యరాజా పూర్వదేశ యాత్రలు:* ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.

*◆ సత్యవతీ చరిత్రము(1883):*  స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది.

*◆ చంద్రమతీ చరిత్రము (1884):* మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

*☀ప్రహసనాలు..*
◆సాంఘిక దురాచారాలను సంభాషణాత్మ
కంగా,వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. 

*☀కథలు..*
◆ అధికంగా కందుకూరి కథలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించా డు. "నీతి కథా మంజరి" అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు.

*☀వీరేశలింగం నడిపిన పత్రికలు..*
◆ వివేక వర్ధిని,సతీహిత బోధిని,సత్య సంవర్ధిని,సత్యదూత,చింతామణి,తెలుగు జనానా.

*🌟ఆయనకున్న ఇతర విశిష్టతలు:*

★మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
★మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
★తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
★తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే
★తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూరి.

*■ యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు  "గద్య తిక్కన "అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించాడు.*

*☀వీరేశలింగంకు నివాళులు..*
◆ఆరుద్ర ఇలా అన్నాడు (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)

*" అదేం చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్ఠం చేసి దేశాభివృద్ధిని, భాషాభివృద్ధిని సాధించిన మనోబల భీములలో పంతులుగారు ప్రధములు. రెండోవారు గురజాడవారు. అటువంటి ఉజ్వల చారిత్రకుని ఏ బిరుదుతో వర్ణించినా అది అసమగ్రమే. అయినా నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించినవారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను. అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ"*

◆చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధి పైఈ నాటికీ కనిపిస్తుంది.

*“తన దేహము తన గేహముతన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకే వినియోగించినఘనుడీ వీరేశలింగకవి జనులార!”*

*జ:ఏప్రిల్16,1848 -మ:మే 27,191*

*💥మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క.... ఇప్పటినుండి ఒక లెక్క....*.

*💥మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క.... ఇప్పటినుండి ఒక లెక్క....*.                         

కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.

🏠🏕️ *ఇంటి నుంచే మొదలవ్వాలి*🏡🏝️🏕️

లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.

🗒️ *కిరాణా లిస్ట్​ మారాలి🗒️

ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి.

🍉🍊🍅🍋🥥🍌🥬🥒🌶️🍆🌽🧅🥦🥕🥭🍑🍈🍒 *ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి*

కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి.

 🧘‍♂️🧘‍♀️ *వర్కవుట్స్​ కంపల్సరీ* 

శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.

 🛀 🚿 *పర్సనల్​  హైజీన్​* 🚿🚰

వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.

🧹🚽🪒🧽 *శుభ్రత* 

ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది.

 👨‍👨‍👦 *పిల్లలు, పెద్దల పట్ల..*

పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.

 🚷 *అవుట్​డోర్​ మీటింగ్స్​..* ,

టైంపాస్​ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.

 *సెల్ఫ్​ డిసిప్లిన్​..* 

సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.వ్యక్తీగత శుభ్రత పాటిస్తూ... ఆరోగ్యంగా... ఆనందంగా ఉంటూ... సంతోషంగా మెలుగుతూ... అందరికీ ఆదర్శంగా ఉండాలి.
నమస్తే..... 🙏
~~~~~~~~~~~~~~

Monday, 30 March 2020

మన తెలుగు జ్ఞాన సంపద. విశ్వ మానవాళికి దీక్షుచి. మన భావితరాల భవిష్యత్. అమ్ములపొది అందరు చదవండి చదివించండి మీ పిల్లలకు నేర్పించండి.

మన తెలుగు జ్ఞాన సంపద. 
 విశ్వ మానవాళికి దీక్షుచి. 
మన భావితరాల భవిష్యత్. 
అమ్ములపొది  అందరు చదవండి  చదివించండి మీ పిల్లలకు నేర్పించండి. 


 దిక్కులు 
(1) తూర్పు, 
(2) పడమర 
(3) ఉత్తరం 
(4)దక్షిణము 

మూలలు 
(1) ఆగ్నేయం, 
(2) నైరుతి,
(3) వాయువ్యం, 
(4) ఈశాన్యం

 వేదాలు
(1)సామవేదం 
(2)ఋగ్వేదం 
(3) యజుర్వేదం 
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

 పంచభూతాలు 
(1) గాలి, 
(2) నీరు,
(3) నిప్పు, 
(4) భూమి,
(5) ఆకాశం,


  పంచేంద్రియాలు 

(1) కన్ను, 
(2) ముక్కు, 
(3) చెవి, 
(4) నాలుక,
(5) చర్మం.

 లలిత కళలు 
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

  పంచగంగలు 
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి, 
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు 

(1) మందారం, 
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం, 
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు 
(1) స్నానం,
(2) పూజ, 
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  
పంచామృతాలు 
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర, 
(5) తేనె.

 పంచలోహాలు 
(1) బంగారం, 
(2) వెండి, 
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు 

(1) అమరావతి, 
(2) భీమవరం, 
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

 షడ్రుచులు 
(1) తీపి,
(2) పులుపు, 
(3) చేదు,
(4) వగరు, 
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు  షడ్గుణాలు

(1) కామం, 
(2) క్రోధం,
(3) లోభం, 
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష, 
(4) శరద్ఋతువు, 
(5) హేమంత,
(6) శిశిర

  సప్త ఋషులు 
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు, 
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, 
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు 
(1) శేషాద్రి,
(2) నీలాద్రి, 
(3) గరుడాద్రి, 
(4) అంజనాద్రి, 
(5) వృషభాద్రి, 
(6) నారాయణాద్రి, 
(7) వేంకటాద్రి.

  సప్త వ్యసనాలు 
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం, 
(4) వేట,
(5) వ్యభిచారం, 
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు 
""""""""""""""""""""""
(1) గంగ, 
(2) యమునా, 
(3) సరస్వతి, 
(4) గోదావరి, 
(5) సింధు,
(6) నర్మద, 
(7) కావేరి.
            
 నవధాన్యాలు 
(1) గోధుమ,
(2) వడ్లు, 
(3) పెసలు,
(4) శనగలు, 
(5) కందులు,
(6) నువ్వులు, 
(7) మినుములు, 
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు 
(1) ముత్యం, 
(2) పగడం, 
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం, 
(7) కనకపుష్యరాగం, 
(8) పచ్చ (మరకతం), 
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు 
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి, 
(4) రాగి, 
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం, 
(8) తగరం, 
(9) కాంతలోహం.

  నవరసాలు
(1) హాస్యం,
(2) శృంగార, 
(3) కరుణ, 
(4) శాంత, 
(5) రౌద్ర, 
(6) భయానక,
(7) బీభత్స, 
(8) అద్భుత,
(9) వీర

  నవదుర్గలు 

(1) శైలపుత్రి, 
(2) బ్రహ్మ చారిణి, 
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత, 
(6) కాత్యాయని, 
(7) కాళరాత్రి, 
(8) మహాగౌరి, 
(9) సిద్ధిధాత్రి.

  దశ సంస్కారాలు 

( 1 ) వివాహం, 
( 2 ) గర్భాదానం, 
( 3 ) పుంసవనం , 
( 4 ) సీమంతం, 
( 5 ) జాతకకర్మ, 
( 6 ) నామకరణం, 
( 7 ) అన్నప్రాశనం, 
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం, 
(10) సమవర్తనం

   దశావతారాలు 
( 1 ) మత్స్య, 
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ, 
( 4 ) నరసింహ, 
( 5 ) వామన, 
( 6 ) పరశురామ, 
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ, 
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు 

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 

తమిళనాడు ~ రామలింగేశ్వరం
 
 తెలుగు వారాలు 
(1) ఆది, 
(2) సోమ, 
(3) మంగళ, 
(4) బుధ, 
(5) గురు, 
(6) శుక్ర, 
(7) శని.

  తెలుగు నెలలు 
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం, 
( 4 ) ఆషాఢం, 
( 5 ) శ్రావణం, 
( 6 ) భాద్రపదం, 
( 7 ) ఆశ్వీయుజం, 
( 8 ) కార్తీకం, 
(9 ) మార్గశిరం, 
(10) పుష్యం, 
(11) మాఘం, 
(12) ఫాల్గుణం.

  రాశులు 

( 1 ) మేషం,
( 2 ) వృషభం, 
( 3 ) మిథునం, 
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం, 
( 6 ) కన్య, 
( 7 ) తుల, 
( 8 ) వృశ్చికం, 
( 9 ) ధనస్సు, 
(10) మకరం, 
(11) కుంభం, 
(12) మీనం.

  తిథులు 
( 1 ) పాఢ్యమి, 
( 2 ) విధియ, 
( 3 ) తదియ, 
( 4 ) చవితి,
( 5 ) పంచమి, 
( 6 ) షష్ఠి, 
( 7 ) సప్తమి, 
( 8 ) అష్టమి, 
( 9 ) నవమి, 
(10) దశమి, 
(11) ఏకాదశి, 
(12) ద్వాదశి, 
(13) త్రయోదశి, 
(14) చతుర్దశి, 
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు 

( 1 ) అశ్విని, 
( 2 ) భరణి, 
( 3 ) కృత్తిక, 
( 4 ) రోహిణి, 
( 5 ) మృగశిర, 
( 6 ) ఆరుద్ర, 
( 7 ) పునర్వసు, 
( 8 ) పుష్యమి, 
( 9 ) ఆశ్లేష, 
(10) మఖ, 
(11) పుబ్బ, 
(12) ఉత్తర, 
(13) హస్త, 
(14) చిత్త, 
(15) స్వాతి, 
(16) విశాఖ, 
(17) అనురాధ, 
(18) జ్యేష్ఠ, 
(19) మూల, 
(20) పూర్వాషాఢ, 
(21) ఉత్తరాషాఢ, 
(22) శ్రావణం, 
(23) ధనిష్ఠ, 
(24) శతభిషం, 
(25) పూర్వాబాద్ర, 
(26) ఉత్తరాబాద్ర, 
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు 

( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :- 
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 
1934, 1994, 2054, 2114

9యువ.  - 
1935, 1995, 2055, 2115

10.ధాత.  - 
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 
1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 
1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 
1943, 2003, 2063, 2123

18.తారణ. - 
1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. - 
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 
1948, 2008, 2068, 2128

23.విరోధి. - 
1949, 2009, 2069, 2129

24.వికృతి. - 
1950, 2010, 2070, 2130

25.ఖర. 
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ. 
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 
1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 
1957, 2017, 2077, 2137

32.విళంబి. 
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి. 
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 
1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 
1967, 2027, 2087, 2147

42.కీలక. 
1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 
1969, 2029, 2089, 2149

44.సాధారణ . 
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 
1971, 2031, 2091, 2151

46.పరీదావి. 
1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 
1973, 2033, 2093, 2153

48.ఆనంద. 
1974, 2034, 2094, 2154

49.రాక్షస. 
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156, 

51.పింగళ                 
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి         
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి              
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                 
1980, 2040, 2100, 2160

55.దుర్మతి              
1981, 2041, 2101, 2161

56.దుందుభి             
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి         
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                 
1984, 2044, 2104, 2164

59.క్రోదన                  
1985, 2045, 2105, 216

60.అక్షయ              
1986, 2046, 2106, 2166.
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..
Pulluri Sai

Saturday, 28 March 2020

corona pledge

Hi all ,
Take a corona pladge from here,and please give awareness to the people
1.open your browser
2. Copy paste below in browser
3.https://www.injntu.com/pledge/
4. Filled  information
5. After filling take a pledge
6 .download the certificate


Thursday, 26 March 2020

మీరు మారాలనుకుంటున్నారా?

✌🏻 మీరు మారాలనుకుంటున్నారా?

 👍🏻 విత్తనం మొక్కవుతుంది. మొక్క చెట్టవుతుంది. చెట్టు మహావృక్షంగా మారి కొన్ని లక్షల విత్తనాలను సృష్టిస్తుంది. ఇది పరిణామక్రమం, మనిషి శరీరం కూడా అలాగే పరిణామం చెందుతుంది, కాని… మనసు సహజ సిధ్ధంగా పరిణామం చెందదు. మనసు పరిణామం చెందాలంటే మనిషి ప్రయత్నం చేసి తీరాలి. మానసికమైన మార్పునకు మనిషి ఆలోచనా వైఖరిలో మార్పు రావాలి. అప్పుడే మార్పును గుర్తించగలం.

ప్రకృతి కూడా ప్రతీ సంవత్సరం ఋతువుల ప్రకారం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలని తపన పడితేనే ఆ మార్పు జరుగుతుంది. ఇది సహజసిద్ధమైనది కాదు. గొంగళిపురుగు ఒక జీవి కనుక మార్పుకు ప్రయత్నం చేస్తుంది. కొన్ని గొంగళిపురుగులు ఆ మార్పు చెందకుండానే జీవితాన్ని చాలిస్తాయి. జీవుల్లో కెల్లా అత్యంత అభివృద్ది చెందిన మనిషి మార్పుకోసం ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే ఆ మనిషి కుటుంబంలో, సమాజంలో మెప్పు పొందగలుగుతాడు, తృప్తిగా జీవించగలుగుతాడు.

మనం సంతోషంగా వుంటూ మన చుట్టుప్రక్కల వారిని సంతోషంగా వుంచాలనుకుంటే మార్పును ఆహ్వానించడం తప్పనిసరి. మనిషిలో మార్పుకు మూలకారకం – ఆలోచనా సరళి. దాన్నే వైఖరి, దృక్పథం అంటాం, ‘నాలో మార్పుకు నేను ఎలా ఆలోచించాలి’ అని ప్రతీ వ్యక్తి ప్రశ్నించుకోవాలి. మార్పుకోసం ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనే తపన తో ‘ ఓపెన్ మైండెడ్’ గా స్వాగతించాలి. పారాషూట్స్ ఓపెన్ చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే మనిషి ‘ఓపెన్ మైండెడ్’గా తపనతో వుంటేనే మార్పు కలుగుతుంది. “నాలో మార్పు అవసరం, నేను మారితీరాలి, నా ఆలోచనా తీరులో నేను మారగలను” అనే తపనతో వుంటే ‘CHANGE’ అనే ఇంగ్లిష్ పదంలోనే సారాంశమంతా కన్పిస్తుంది. అదేంటో చూద్దాం.

🍎 C = CREATE OPPORTUNITIES

H = HANDLE THE SITUATION

A = ACCEPT THEM AS CHANLLENGES

N = NEVER QUIT

G = GAIN KNOWLEDGE

E = EVALUATE YOUR EXPERIENCES

జీవితంలో మార్పు కావాలంటే పై పదంలోని ఒక్కొక్క అక్షరానికి వున్న అర్ధాన్ని అదే క్రమంలో పాటిస్తే మార్పును తప్పనిసరిగా రుచి చూడగలం.

🍎 CREATE OPPORTUNITIES
          అవకాశాలు వాటంతటి అవిరావు. మనం కల్పించుకోవలసిందే. “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా” అనే సినిమా పాట ఉండనే వుంది. కనుక “అదృష్టం,దురదృష్టం, కలిసి రావాలి” అని అనుకుంటూ కూర్చోకుండా అవకాశాలను కల్పించుకోవడమే మార్పుకు మొదటి మెట్టు. మనం వున్న వాతావరణంలోనే వుండి, ఎంతో వృద్ధిలోకి వచ్చిన వారిని అధ్యయనం చేస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్ధమౌతుంది. వారందరూ అవకాశాలను కల్పించుకున్న వారే కాని ఎవరో అవకాశాలను కల్పించి విజయాలను అదించలేదు.

🍎 HANDLE THE SITUATIONS

          అవకాశాలను కల్పించుకున్న తర్వాత క్రొత్త పరిస్థితులు, క్రొత్త అనుభవాలను ఎదుర్కోవటం సహజం. మార్పు మాత్రమే మన ధ్యేయం అనుకుని పరిస్థితులను చాకచక్యంగా, ఓపికగా, పట్టుదలతో జయించగలిగితే మంచి అనుభవం వస్తుంది, వచ్చిన అనుభవంతో మరింత ఉత్తేజంతో ముందుకు సాగాలి.

🍎 ACCEPT THEM AS CHALLENGES

          మార్పుకోసం ప్రతీ విషయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి, సమాధానం లేని సమస్యలు లేవు కనుక ప్రతీ సమస్యను సవాలుగా తీసుకుని పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. ఛాలెంజ్ గా తీసుకోవడమనేది ఒక రకమైన మనస్తత్వం అని నమ్మి ఆలోచనా ప్రక్రియ ద్వారా అటువంటి మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.

🍎 NEVER QUIT

          విజేతలు విడిచి పెట్టరు. విడిచిపెట్టేవారు విజేతలు కాలేరు. ఇది జగమెరిగిన సత్యం. కనుక మార్పుకోసం చేసే ప్రయత్నంలో పట్టుసడలని ప్రయత్నాన్ని అలవాటు చేసుకోవాలి. దానివల్ల మనస్తత్వంలో మార్పు వస్తుంది. తద్వారా జీవితంలో మార్పు వస్తుంది.

🍎 GAIN KNOWLEDGE

          అవకాశాలను సృష్టించుకుని, అవకాశాలను జారవిడవకుండా పరిస్థితులను జాగ్రత్తగా నిర్వహించి, ఛాలెంజ్ గా తీసుకుని, పట్టుదలతో చెయ్యడం వలన ఒక గొప్ప అనుభవం కలుగుతుంది. ఈ కొత్త అనుభవాన్ని నెమరు వేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. విజ్ఞానం వున్నవాడు విజయం వైపుకు దూసుకువెళ్తాడు. అనుభవం తో వచ్చిన విజ్ఞానం మార్పుకు పెద్ద పెట్టుబడి లాంటిది.

🍎 EVALUATE YOUR EXPERIENCES:

          మనకు కలిగిన అనుభవాలను పరీక్షించుకుంటే మనకొక విషయం అర్ధమౌతుంది. ఈ ప్రపంచంలో ప్రతీ విషయం నేర్చుకునే దశలో చాలా కష్టంగానే వుంటుంది. సాధన ద్వారా చాలా సుళువు అవుతుందని మనకు అర్ధమౌతుంది. కనుక ఏదీ కష్టం కాదు అనే మనస్తత్వం అలవాటౌతుంది. ఇది మార్పుకు ఎంతో దోహదపడుతుంది.

          ఉదాహరణకు… సైకిల్ తొక్కడం, అక్షరాలు నేర్చుకోవడం, స్కూటర్ నడపటం, ఈత కొట్టడం లాంటి ప్రతీ పని ప్రారంభదశలో కష్టంగానే అనిపించినా నేర్చుకున్న తర్వాత అది ఎంత సులభమైన విషయమో… అందరికీ అనుభవమే.

          మార్పు ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే మనం ఎప్పుడూ చేసిన పనులనే చేస్తూ వుంటే… ఎప్పుడూ వచ్చిన ఫలితాలే వస్తాయి

Pulluri Enterprises catalogue/services

Pulluri Enterprises catalogue /services
You can download our app from Play Store
#pulluri enterprises
https://play.google.com/store/apps/details?id=com.img.pulluri

Contact:7013650063

*🌷ఈ 4 టిప్స్ ఫాలో అయితే బ్యాంకు ఉద్యోగం గ్యాgరెంటీ🌷*

*🌷ఈ 4 టిప్స్ ఫాలో అయితే బ్యాంకు ఉద్యోగం గ్యాgరెంటీ🌷*

👉డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ.. విద్యార్హత ఏదయినా సరే.. నేతి తరం యువత బ్యాంకు ఉద్యోగాలకై పరుగులు తీస్తోంది. కోచింగ్ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తోంది. ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ.. అంటూ వరుసపెట్టి బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తోంది. మొదటిసారి విఫలం అయినా.. విజయం కోసం మాటిమాటికీ నిరుద్యోగులు బ్యాంకు ఎగ్జాములు రాస్తూనే ఉన్నారు. లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ అంటూ.. కోచింగ్ సెంటర్లు నిరుద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తోంది. కోచింగ్ సెంటర్ల సంగతి పక్కనపెడితే.. మొట్టమొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం సాధించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు. ఓ నాలుగు టిప్స్‌ను పాటిస్తే బ్యాంకు పరీక్షలను మొట్టమొదటి ప్రయత్నంలోనే పాసై.. కొలువులో కొలువుదీరడం గ్యారెంటీ అంటున్నారు. మరి ఆ నాలుగు టిప్స్ ఏంటో ఓ లుక్కేద్దామా..?
 
*🌻1. సిలబస్‌ను తూచా తప్పకుండా ఫాలో అవడం:🌻*

👉పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, క్లర్క్ అంటూ వచ్చే నోటిఫికేషన్స్‌కు వేటికవే సిలబస్ ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ లెవల్స్‌లో కూడా తేడా ఉంటాయి. సిలబస్‌ను తూచా తప్పకుండా పాటించి, అందులోని టాపిక్స్‌ను ఆసాంతం పూర్తి చేస్తే విజయానికి మొదటి మెట్టు ఎక్కినట్లే. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జాములకు అనుగుణంగా ప్రపరేషన్ ఉండాలి.
 
*🌻2. ఆన్సర్లు తెలియకపోతే వదిలేయండి🌻*

👉పరీక్షా సమయంలో ప్రశ్నలను చూసి చాలామంది కంగారుపడుతుంటారు. చదివాను కానీ గుర్తు రావడం లేదేంటని తర్జనభర్జన పడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి చివరకు ‘ఇదే కరెక్ట్ అనుకుంట’ అని ఓ ఆన్సర్‌ను టిక్ చేస్తుంటారు. ఈ పద్ధతికి స్వస్థి చెబితేనే మేలు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వదిలేయండి. అనవసరంగా ఆలోచించి, ఒక్క ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించి అంతిమంగా నష్టపోతారు. అందులోనూ నెగిటివ్ మార్కింగ్ ఉండనే ఉంది.
 
*🌻3. మాక్ టెస్టులు, మోడల్ పేపర్లు🌻*

👉పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి.. అంటుంటారు కదా.. అదే విధంగా బ్యాంకు ఎగ్జాములే కాదు ఏ పరీక్ష అయినా.. గతంలో వచ్చిన ప్రశ్నా పత్రాలు, మోడల్ పేపర్ల అంతు చూడాల్సిందే. ప్రశ్నాపత్రాల సరళి ఎలా ఉంది.. ఇకపై ఎలా ఉండబోతోంది..? వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన సాధించాలి. ఈ ప్రశ్నాపత్రాలను సాధించడం ద్వారా అభ్యర్థుల్లో కాన్ఫిడెంట్ పెరుగుతుంది.
 
*🌻4. టైమ్ మేనేజ్‌మెంట్🌻*

👉బ్యాంకు ఎగ్జామ్‌ల పనిపట్టాలంటే.. ఎంతో ప్రణాళిక ఉండాలి. సిలబస్‌ను ఆసాంతం చదవడమే కాదు. దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిగ్యూట్ చేస్తున్నామా..? లేదా..? అన్నది కూడా చాలా ముఖ్యం. దీనికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్.. అంటూ ప్రతీ కేటగిరీకి సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ పోకుంటే చాలా కష్టం. అందుకే మోడల్ పేపర్లు, మాక్ టెస్టుల్లో పాల్గొంటే మీ సత్తా ఏంటో మీకే తెలుస్తుంది. తద్వారా మీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీకు మీరే సరిదిద్దుకోగలరు. షార్ట్‌కట్‌లను సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవాలి.


*📚📚పదవ తరగతి, తర్వాత ఏం చేయాలి??ఏమి ఎంచుకోవాలి??*📚📚_

_*📚📚పదవ తరగతి,  తర్వాత ఏం చేయాలి??ఏమి ఎంచుకోవాలి??*📚📚_

_*✅సోపానం✅.*_

_*🧶🧶ఇంతటి కీలకమైన దశను దాటిన తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి?*_

 _*♻ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి♻.*_

_*🧶హెచ్ఈసీ :🧶*_

_*సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్ హెచ్ఈసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యా పరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు.*_
_*సంప్రదాయ డిగ్రీ కోర్పులతో పాటు జాబ్ ఓరియెంటెడ్ డిప్లోమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి.*_

_*🛍ఇంటర్మీడియెట్ ఎంపీసీ :.🛍*_

 _*🧶ఇంజనీర్ గా కెరీర్ లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితం పై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్ లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్ లో చేరిన మొదటి రోజు నుంచి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బిట్ శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషి చేయాలి. ఇంజనీరింగ్ కెరీర్ పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగు పెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.*_

_*📗సీఈసీ, ఎంఈసీ :📗*_

 _*🧶వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణ పై ఆసక్తి ఉన్న వారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్ లో నైపుణ్యాలున్నవారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్లు సీఈసీ,*_

_*📘బైపీసీతో వైద్యం📘*_

_*🧶మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కషపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూఫ్ లో ప్రాక్టికల్స్ కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను, ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్ లో చేరి డాక్టర్ గా జీవితంలో స్థిర పడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సు చేయాలి. అందువల్ల ఆసక్తి, కుటుంబ, ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.*_

_*✴నోటిఫికేషన్ కోర్సులు✴*_

_*🧶అర్హత : పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.*_

_*✳కెరీర్ : బ్రాంచ్ కి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెల్గొచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తిచేసింది తడవు తక్షణ ఉపాధి లభిస్తుంది.*_

_*✅ముఖ్యమైనవి✅*_

_*♻ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్*♻_

 _*🧶కరిక్యులం : వర్క్ షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్ మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్.*_

_*✅ఉద్యోగావకాశాలు✅ : ఆటో మెకానిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/ మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లెబారెటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రిషియన్.*_

_*✅మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్✅ :*_
 
_*.🧶ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, వర్క్ షాప్ టెక్నీషియన్, పవప్ ప్లాంట్ ల టెక్నీషియన్, సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.*_

_*✅ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ :*_
 ఉద్యోగావకాశాలు : ఎల క్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ టెస్టర్రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్,థట

_*✅ఎలక్ట్రికల్ టెక్నీషియన్ : ఉద్యోగావకాశాలు : ఎలక్ట్రానిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్ మ్యాన్.*_

_*✅టిఐ/ఐటిసి : ఇండస్ట్రియల్ టైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ టైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.*_

_*✅అర్హత : ఐటీఐ/ఐటీసీ లలోని ట్రేడ్లలో పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.*_

_*🧶కోర్సులు : ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్లకాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.*_

_*📚స్వయం ఉపాధి దిశగా 📚:*_

 _*🛍ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే స్వయం ఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్కు అవసరమైన ఎన్నో కోర్సులను అతి తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే కోర్సుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్, సెల్ ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్ ఫుట్వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ క్రీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, పుట్టవంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.*_

_*కోర్సులు - విభాగాలు*_ 
_*ఇంటర్మీడియెట్*_
_*ఎంపీసీ*_
_*బైపీసీ*_
_*సీఈసీ*_
_*ఎంఈసీ*_
_*హెచ్ఈసీ*_
_*పాలిటెక్నిక్*_
_*సివిల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఆటోమొబైల్
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్
ఈఈఈ, ఈసీఈ
కంప్యూటర్ ఇంజనీరింగ్
ఐటీఐ/ఐటీసీ
ఫిట్టర్
ఎలక్ట్రిషియన్
ఇన్స్ స్ట్రూమెంట్ మెకానిక్
వెల్డర్, టర్నర్, ప్లంబర్
కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
ఇంటర్ వొకేషనల్ కోర్సులు
క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్ మెంట్
అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
వ్యవసాయ పాలిటెక్నిక్ లు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లోమా
వ్యవసాయ పాలిటెక్నిక్ లు గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లోమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా, డిప్లోమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.*_

_*🧶అర్హత ప్రధేశాలు : పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్. పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.*_

_*♻అవకాశాలు : వ్యవసాయ డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సాంత్ర ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.*_

_*♻పాలిటెక్నిక్ కోర్సులు : తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లోమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.*_

_*✳అర్హత : పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్భీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.*_

_*✴మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి.*_

_*☸కెరీర్ : పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్ మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.*_

_*🔯వేతనాలు : చేరిన సంస్థను బట్టి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.*source _KRANTHI sir fb

కరోనా దశలు(స్టేజ్-1,2 & 3) అంటే ఏమిటి?

*కరోనా దశలు(స్టేజ్-1,2 & 3) అంటే ఏమిటి?* 

 *మొదటి దశ:*

 నవిన్ విదేశాల నుండి వచ్చారు.  విమానాశ్రయంలో అతనికి జ్వరం లేదు.  అతన్ని ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు.  అయితే అతన్ని 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో పూర్తిగా ఒంటరిగా ఖైదు చేసుకోమని, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండాలని మరియు ఇంటిని వదిలి బయటకి వెళ్లొద్దని  , మరియు జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని చెప్పివిమానాశ్రయంలో  అఫిడవిట్ పై సంతకం చేయించుకుని ఇంటికి పంపించారు. 
 ఇంటికి వెళ్లి, అతను అఫిడవిట్ యొక్క షరతులను అనుసరించాడు.
 అతన్ని ఇంట్లో ఖైదు చేశారు.
 అతను ఇంటి సభ్యుల నుండి కూడా దూరంగా ఉన్నాడు.

 నవిన్ తల్లి "హే, నీకు ఏమీ జరగలేదు" అన్నారు.  "ఒంటరిగా ఉండకు.  చాలా రోజులైంది ఇంటి ఆహారం తిని, రా కిచిన్ లో నేను వేడి వేడి ఆహారాన్ని అందిస్తాను." అని పిలిచింది. 

 నవిన్ నిరాకరించారు.

 మరుసటి రోజు ఉదయం, మమ్మీ మళ్ళీ అదే మాట చెప్పింది.  ఈసారి నవాంకూర్‌కు కోపం వచ్చింది.  అతను మమ్మీకి అరిచాడు.  మమ్మీ కంటిలో కన్నీళ్ళు కనిపించాయి.  తల్లికి చెడుగా అనిపించింది.

 నవిన్ ఒంటరిగా ఉండిపోయాడు.

 6-7 వ రోజుల తర్వాత నవిన్ కు జ్వరం, జలుబు దగ్గు వంటి లక్షణాలు రావడం ప్రారంభించాయి.  నవిన్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు.  కరోనా పరీక్ష జరిగింది.  అతను పాజిటివ్‌గా మారిపోయాడు.
 అతని కుటుంబ సభ్యులను కూడా పరీక్షించారు.  అవన్నీ నెగెటివ్‌గా మారాయి.
 1 కిలోమీటర్ల వ్యాసార్థంలో పొరుగువారిని ఎక్కువగా ప్రశ్నించారు.  అలాంటి వారందరినీ పరీక్షించారు.  నవిన్ ఇంటి నుండి బయటకు రావడాన్ని ఎవరూ చూడలేదని అందరూ చెప్పారు.
 అతను తనను తాను బాగా వేరుచేసినందున, అతను కరోనాను మరెవరికీ వ్యాప్తి చేయలేదు.
 నవిన్ కి కరోనా లక్షణాలు చాలా తక్కువ.  జ్వరం, జలుబు దగ్గు, శరీర నొప్పి మొదలైనవి.  7 రోజుల చికిత్స తర్వాత, అతను పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చాడు.

 ఇల్లు అంతా కరోనా లేదని నిన్న చెడుగా భావించిన తల్లికి ఈ రోజు కరోనా తీవ్రత అర్థమయ్యింది. 

 విదేశాల నుండి వచ్చిన మనిషిలో మాత్రమే కరోనా ఉంటే మొదటి దశ ఇది.  అతను దానిని మరెవరికీ వ్యాపింప చేయాలేదు.
 *******************************

 *స్టేజ్ 2-కరోనా:*

రాజుకి కరోనా ఉందని టెస్టు ద్వారా నిర్దారణ అయ్యింది. దానితో అధికారులు తన  మునుపటి రోజుల సమాచారం మొత్తం అడిగారు.  అతను విదేశాలకు వెళ్ళలేదని తేలింది.  కానీ అతను ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని కలిశానని చెప్పాడు.  మొన్న  అతను నగలు కొనడానికి ఒక ఆభరణాల షాపువద్దకు వెళ్ళాడు.  ఆ షాపు యజమాని ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చారు. షాపు యజమాని విదేశాల నుండి వచ్చినప్పుడు విమానాశ్రయంలో  అతనికి జ్వరం లేదు.  అందుకే అతన్ని ఇంటికి వెళ్ళడానికి షరతులతో అనుమతించారు. అతన్ని 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో ఖైదు చేసుకోమని, బయటకి వెళ్లొద్దని  విమానాశ్రయంలో అఫిడవిట్ ఇచ్చారు, మరియు జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని చెప్పి ఇంటికి పంపించారు. 
కానీ అతను అఫిడవిటులో నింపిన షరతులను పాటించలేదు. 
 అతను ఇంట్లో కలియతిరిగాడు, కుటుంబసభ్యులతో కలిసి  తిన్నాడు మరియు మరుసటి రోజు అతను తన ఆభరణాల దుకాణానికి వెళ్ళాడు.
 (మీకు పిచ్చి ఉందా! ఇది సీజన్, మిలియన్ల అమ్మకాలు ఉన్నాయి, ఆభరణాల వ్యాపారి  తన దుకాణాన్ని మూసివేయడు. )

 6 వ రోజు ఆ యజమానికి జ్వరం వచ్చింది.  అతని కుటుంబంలోని వారికి కూడా జ్వరం వచ్చింది.  కుటుంబ సభ్యులలో వృద్ధ తల్లి కూడా ఉంది. అందరిపై దర్యాప్తు జరిగింది.  దర్యాప్తులో అందరికి కరోనా ఉందని రిపోర్టులు వచ్చాయి.

 అంటే, విదేశాల నుండి వచ్చిన వ్యక్తి స్వయంగా పాజిటివ్. అప్పుడు అతను హౌస్‌మేట్స్‌ను కూడా పాజిటివ్‌గా చేశాడు. 
 అదనంగా, అతను దుకాణంలో 450 మందితో పరిచయం ఏర్పడ్డాడు.  సేవకులు, కస్టమర్లు మొదలైనవారు. వారిలో ఒకరు రాజు. మొత్తం 450 మందిని తనిఖీ చేస్తున్నారు.  వాటిలో పాజిటివ్ ఉన్నప్పటికీ ఇది *రెండవ దశ* .

 *భయం ఏమిటంటే, ఈ 450 మందిలో ప్రతి ఒక్కరికి వారు ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవచ్చు.* 

 మొత్తంమీద, స్టేజ్ 2 అంటే కరోనా పాజిటివ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి విదేశాలకు వెళ్ళలేదు.  కానీ అతను ఇటీవల విదేశాలకు వచ్చిన వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాడు.
 *******************************

 *స్టేజ్ 3* 

 జలుబు దగ్గు జ్వరం కారణంగా రామ్‌సింగ్ ఆసుపత్రి పాలయ్యాడు, అక్కడ కరోనా పాజిటివ్ వచ్చింది.
 కానీ రామ్‌సింగ్ కూడా విదేశాలకు వెళ్ళలేదు.
 అతను ఇటీవల విదేశాలకు వచ్చిన ఎవరితోనూ పరిచయం చేయలేదు.

 అంటే, రామ్‌సింగ్ చివరకు ఎక్కడ నుండి కరోనాను అనుభవించాడో మనకు తెలియదు.

 స్టేజ్ 1 లో మనిషి స్వయంగా విదేశాల నుండి వచ్చాడు.

 2 వ దశ మూలం షాపు యజమాని అని తెలుసు.  మేము షాపు యజమానిని  మరియు అతనితో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని పరీక్షించాము మరియు అతనిని 14 రోజులు వేరుచేసాము.

 3 వ దశలో మీకు మూలం(అంటే ఎవరి నుంచి వచ్చింది) తెలియదు.

  మనకు మూలం తెలియకపోతే, మనం  మూలాన్ని సంగ్రహించలేము.  దానిని వేరుచేయలేము. ఆ మూలం ఎక్కడ ఉంటుందో మరియు  వారి వలన అనుకోకుండా ఎంత మందికి సోకుతుందో..?? 🥵❗

 *3 వ దశ ఎలా చేయబడుతుంది?*

 షాపు యజమానితో పరిచయం ఉన్న 450 మంది.  యజమాని కరోనాని   వ్యాపింపచేసాడనే వార్త తెలియగానే అతని కస్టమర్లు, పనిమనిషి, ఇంటి పొరుగు, షాప్ పొరుగు, మిల్క్ మాన్, పేపర్ బాయ్, చాయ్ వాలా… అందరూ ఆసుపత్రికి పరిగెత్తారు. అందరూ మొత్తం 440 మంది ఉన్నారు. 10 మంది ఇప్పటికీ కనుగొనబడలేదు. పోలీసులు, ఆరోగ్య శాఖ బృందం వారి కోసం వెతుకుతోంది. ఆ 10 మందిలో ఎవరైనా దేవాలయంలోకి ప్రవేశిస్తే ఈ వైరస్ చాలా వ్యాపిస్తుంది.
 ఇది స్టేజ్ 3 , ఇక్కడ మీకు మూలం తెలియదు.

 *స్టేజ్ 3 పరిహారం*
 14 రోజుల లాక్డౌన్
 కర్ఫ్యూ విధించండి. నగరాన్ని 14 రోజులు లాక్ చేయండి. ఎవరినీ బయటకు రానివ్వవద్దు.

 *ఈ లాకౌట్తో ఏమి జరుగుతుంది ??* 

 ప్రతి మనిషి ఇంట్లో లాక్ చేయబడతాడు.
 సోకిన వ్యక్తితో పరిచయం లేని వ్యక్తి సురక్షితంగా ఉంటాడు.
 తెలియని మూలం కూడా అతని ఇంట్లో లాక్ చేయబడింది.  అతను అనారోగ్యానికి గురైనప్పుడు, అతను ఆసుపత్రికి వస్తాడు.  మరియు ఇది తెలియని మూలం అని మేము తెలుసుకుంటాము.

 ఈ తెలియని మూలం వారి ఇంటి నుండి మరో 4 మందికి సోకినట్లు ఉంది, కాని మిగిలిన నగరం బయటపడింది.

 *LOCKDOWN* లేకపోతే ఆ మూలం (కరోనా ఉన్న వాళ్ళని) పట్టుకోలేక పోయేవాళ్లం. అలాంటి వేలాది మందిలో అతను కరోనాను వ్యాప్తి చేసేవాడు.  అప్పుడు తెలియని   వేలమంది ప్రజలు దీనిని మిలియన్ల మందిలో వ్యాప్తి చేస్తారు.  అందుకే నగరం మొత్తం లాక్డౌన్ వలన కరోనా నుండి బయటపడింది మరియు తెలియని మూలం పట్టుబడింది.

 * స్టేజ్ 2, స్టేజ్ 3 లో మార్చవద్దు. *

 ప్రారంభ లాక్డౌన్ అంటే దశ 3 రాకముందే లాకౌట్.
 ఈ లాక్డౌన్ 14 రోజుల కన్నా తక్కువ ఉంటుంది.

 ఉదాహరణకు
 షాపు యజమాని విమానాశ్రయం నుండి బయలుదేరిన అప్పటి నుంచి వారు ఇల్లు అంతా కరోనా ఇచ్చింది. ఉదయం నిద్రలేచి  షాపుకి వెళ్ళాడు.
 (అద్భుత మనిషి! ఇది సీజన్, లక్షలాది వ్యాపారం  అమ్ముడవుతోంది, దుకాణాన్ని ఎలా మూసివేయాలి)

 కానీ లాకౌట్ ఉన్నందున.
 దాంతో పోలీసులు కర్రతో షాపు యజమాని వైపు పరుగెత్తారు. కర్రను చూసిన యజమాని దుకాణం షట్టర్ మూసివేశి పారిపోయాడు.

 మార్కెట్ ఇప్పుడు మూసివేయబడింది కాబట్టి.
 కాబట్టి 450 మంది కస్టమర్లు కూడా రాలేదు. కాబట్టి అందరూ బయటపడ్డారు.
 రాజు కూడా బయటపడ్డాడు.
 షాపు యజమాని కుటుంబానికి మాత్రమే కరోనా పరిమితమయ్యేది.

 *కరోనా మనకి సోకిన 6 నుండి 7 వ రోజు నాటికి, కరోనా లక్షణాలు కనిపిస్తాయి. అప్పటి వరక మనం చూడడానికి ఆరోగ్యంగా ఉన్నా మనలో వైరస్ ఉన్నట్లే. ఒకవేల ఎటువంటి లక్షణాలు లేకపోతే కరోనా నెగటివ్(లేదని) అని అర్థం.*

ఇప్పుడు మన ముందున్నది కేవలం ప్రభుత్వం చెప్పినట్లు పాటించడమే.. అంటే ఇంటినుండి కొన్ని రోజుల వరకు బయటకీ రాకుండా ఉండేంటం.

 *షేర్ చేయడం మరవొద్దు..*
Source fb

Tuesday, 24 March 2020

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_
_*🦙మేషం🦙*_

_*వీరికి ఏడాది ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1గా ఉంటుంది.*_

వీరికి సంవత్సరమంతా గురుడు, సెప్టెంబర్‌ 23 వరకు రాహువు యోగదాయకులు. శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు.
ప్రారంభం నుంచి అన్ని విధాలా అనుకూల సమయమే.
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.
భవిష్యత్తు మరింత బంగారుమయంగా కనిపిస్తుంది.
ఇతరులు సైతం మిమ్మల్ని మెచ్చుకునే సమయం.
అందరిలోనూ ప్రత్యేక గౌరవమర్యాదలు పొందుతారు.
స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది.
చిరకాల ప్రత్యర్థులు కూడా మీకు శిరస్సు వంచుతారు.
దైవ కార్యాలలో పాల్గొంటారు.
ఆశ్చర్యకరమైన రీతిలో విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు.
నిరుద్యోగులకు ఊహించని రీతిలో ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం.
ఉద్యోగస్తులు గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు అధిగమిస్తారు.
వ్యాపారులు మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుట్టి లాభాల దిశగా పయనిస్తారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభసాటిగా ఉంటాయి.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. అత్యుత్తమ పురస్కారాలు సైతం అందుకునే వీలుంది.
రాజకీయవేత్తలకు మరిన్ని పదవులు దక్కే సూచనలు, వీరికి ఏడాది మంచి ఆదరణ లభిస్తుంది.
కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.
క్రీడాకారులు, న్యాయవాదులకు ఊహించని అభివృద్ధి ఉంటుంది.
సెప్టెంబర్‌ 23 నుంచి రాహువు ద్వితీయ రాశిలో ప్రవేశంతో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, వివిధ వృత్తుల వారికి మార్పులు జరిగే వీలుంటుంది.
_*వీరు రాహువు, శనికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరారాధన మంచిది.*_
_*చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యం.

_*🐂వృషభం🐂*_

_*వీరికి ఈ ఏడాది ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం –1గా ఉంటుంది.*_
ఇక వీరికి కుటుంబ స్థానంలో సెప్టెంబర్‌ 23 వరకు, తదుపరి జన్మ స్థానంలో రాహు సంచారం, అలాగే, మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు గురుడు భాగ్య స్థానంలో అతిచారం సంచార కాలం శుభదాయకంగ ఉంటుంది. తదుపరి నవంబర్‌ 20 వరకు అష్టమ స్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్య స్థానంలో సంచారం విశేష యోగకాలం.
ఇక శని కొంత వరకూ యోగాన్నిస్తాడు.
మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన పైకం చేతికందుతుంది.
చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.
తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.
శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండడం మంచిది.
నిరుద్యోగులకు నవంబర్‌ నుంచి శుభదాయకంగా ఉంటుంది,
విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.
వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి.
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ద్వితీయార్థంలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగుతారు.
కళాకారులు క్రమేపీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు కొన్ని తప్పిపోయినా అధైర్యపడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.
క్రీడాకారులకు అనుకూల సమయమని చెప్పాలి.
వీరు ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ వహించాలి.
_*గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది.*_
_*జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలిస్తాయి. మిగతావి సామాన్యం.*_
_*అదృష్టసంఖ్య–6.*

_*👨‍❤️‍👨మిథునం👨‍❤️‍👨*_

_*వీరికి  ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.*_

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తదుపరి నవంబర్‌ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్‌ 29 నుంచి వవంబర్‌ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి.
మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.
ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.
తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.
ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.
మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.
తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.
సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.
అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.
అయితే జూన్‌– నవంబర్‌ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.
అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి.
విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.
ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.
కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది.
టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.
_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్యహృదయం పఠించాలి.*_
_*చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_
_*అదృష్టసంఖ్య–5.*_

_*🦀కర్కాటకం🦀*_

_*ఈ రాశి వారికి ఆదాయం –11, వ్యయం–8, రాజపూజ్యం–5, అవమానం–4గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు శుభుడు, తదుపరి నవంబర్‌ 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమ స్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్‌ 23 నుంచి రాహువు లాభ స్థానంలో శుభుడు.
మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి.
ముఖ్యమైన కార్యక్రమాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు.
ఆలోచనలు అంతగా కలసిరావు.
కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.
ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి.
ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా హోమాలు, యజ్ఞాల వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకుంటారు.
మిత్రులు, బంధువుల నుంచి తరతూ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.
అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగడం వల్ల కొంత అనుకూలత పొందుతారు.
నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగ లాభం.
విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేందుకు చేసే కృషి ఫలిస్తుంది.
వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములు ముందుకు రాకపోవడంతో డీలా పడతారు. విస్తరణలోనూ ఆటంకాలు.
ఉద్యోగస్తులకు అదనపు పనిభారం మీదపడుతుంది. అయితే నవంబర్‌నుంచి శుభదాయకంగా ఉంటుంది.  కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమైన సమయమని చెప్పాలి.
రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు.
కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి.
క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.
_*వీరు, శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.*_
_*ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యం.*_
_*అదృష్టసంఖ్య–2.*_

_*🦁సింహం🦁*_

_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–1, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి షష్ఠమ స్థానంలో సంచరించిన కాలంలో సామాన్య స్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారంపరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

జూన్‌ 29 నుంచి నవంబర్‌వరకు గురుని పంచమ స్థానంలో సంచారం శుభదాయకం.  ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే.
మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి.
వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

కోర్టుల్లో కొన్నేళ్లుగా నలుగుతున్న కేసులు పరిష్కారమయ్యే అవకాశం.
ఆస్తులు కొనుగోలు చేస్తారు.
ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే, ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి.
ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు.
కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం.
ఇంట్లో శుభకార్యాల నిర్వహణ.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకోవడంలో కృతకృత్యులవుతారు.
నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.
వ్యాపారస్తులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అలాగే, భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయం. ముఖ్యంగా లోహాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం.
ఉద్యోగులకు చిరకాల సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పదోన్నతులు దక్కుతాయి. అలాగే, పై స్థాయి వారి సహాయం సంపూర్ణంగా అందుతుంది.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.  వీరికి మరింత గుర్తింపు లభిస్తుంది.
కళాకారులు అనుకున్న అవకాశాలు జాప్యం లేకుండా పొందుతారు. కొందరికి అవార్డులు దక్కవచ్చు.
క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు.
రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.
గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.
_*వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి.*_
_*చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి సామాన్యం.*_
_*అదృష్ట సంఖ్య....1.*_

_*🤰కన్య🤰*_

_*ఈ రాశి వారికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూలమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూల సమయంగా భావించాలి.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధన లాభాలు ఉండవచ్చు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

తరచూ దైవకార్యాలు చేపడతారు.

అలాగే, అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.
సంతానపరంగా మరింత సౌఖ్యం, వారి విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు. అలాగే, మంచి ర్యాంకులు సాధిస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇనుము, కలప, బంగారం వంటి వ్యాపారాలు చేసే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు ప్రథమార్ధంలో ఆకస్మిక బదిలీలు అవకాశాలు. ద్వితీయార్థంలో పదోన్నతులు దక్కే అవకాశం.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు తథ్యం. ముఖ్యంగా కార్యజయం.
రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ, పదవీయోగాలు కలుగుతాయి.
వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో అధికంగా లాభాలు గడిస్తారు.
క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాద వృత్తుల వారికి గతం కంటే మరింత మెరుగైన కాలమని చెప్పాలి.
గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లబిస్తుంటుంది.
_*ఇక వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, శ్రీ కృష్ణాష్టోత్తరం, అన్నపూర్ణాష్టక పఠనం మంచిది.*_
_*ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_
_*అదృష్టసంఖ్య–5.*_

_*⚖️తుల⚖️*_

_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్‌వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి ఏ కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది.

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

_*వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్‌ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.*_

_*చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య –6*_

_*🦂🦂వృశ్చికం🦂🦂*_

_*వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.*_

ఇక వీరికి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి.

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి.

ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

క్రీడాకారులు, టెక్నికల్‌ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

_*వీరు నవంబర్‌ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.*_

_*చైత్రం, వైశాఖం, ఆషాఢం,  శ్రావణం,  ఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_
అదృష్ట సంఖ్య.   9

_*🏹🏹ధనుస్సు🏹🏹*_

_*ఈ రాశి వారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం–3గా ఉంటుంది.*_

ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్‌ 30 నుంచి నవంబర్‌ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయ రాశి సంచారంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు.

ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉపశమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్‌ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురుడు ఒక్కడే వీరికి అనుకూలమని చెప్పాలి.

ఆర్థికంగా ప్రధమార్థంలోనూ, చివరిలోనూ విశేషంగా కలసివస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే, జ్ఞాతుల నుంచి కొంత సొమ్ము అందుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా కొంత శ్రమానంతరం పూర్తి కాగల సూచనలు.

బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

స్థిరాస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో తొలగే సూచనలు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర కలసివస్తాయి.

జీవిత భాగస్వామితో కొంత విభేదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టర్లకు ప్రథమార్థం విశేష లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కించుకునే చాన్స్‌.

నిరుద్యోగులకు ప్రథమార్థంలో శుభవార్తలు అందుతాయి.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకున్న పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థం చివరిలో మరింత రాణిస్తుంది.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు శుభదాయకంగా గడుస్తుంది. అయితే మధ్యలో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి.

రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదురైనా నెట్టుకొస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి.

_*వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది.*_

_*ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉంటుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి.*_

_*అదృష్ట సంఖ్య–3.*_

_*🐊🐊మకరం🐊🐊*_

_*ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది.*_

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్‌ 23 నుంచి అనుకూలం.

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి.

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.*_

_*ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–8

_*⚱️⚱️కుంభం⚱️⚱️*_

_*వీరికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–6గా ఉంటుంది.*_

ఇక వీరికి ఏల్నాటి శని దోషం అధికంగా ఉంటుంది. అలాగే, వ్యయస్థానంలో అంటే మార్చి 29 నుంచి జూన్‌ 29వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి గురు సంచారం కూడా ప్రతిబంధకంగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో గురుబలం కాస్త ఊరటనిస్తుంది.

అలాగే, సెప్టెంబర్‌ 23 నుంచి అర్థాష్టమ రాహు దోషం కూడా తోడై ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద వీరికి ఏడాది మధ్యకాలం మినహా మిగతా కాలమంతా చికాకులు తప్పవు.

జూలై–నవంబర్‌ మధ్య కాలం వీరికి విశేషంగా కలసివస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అలాగే, సంతానపరంగా మరింత సౌఖ్యం. కొందరికి సంతానప్రాప్తి కలిగే అవకాశాలు.

శని ప్రభావం వల్ల ఖర్చులతో పాటు వ్యయప్రయాసలు ఎదురై చికాకు పరుస్తాయి.

ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేయడంలో మీ శక్తిసామర్థ్యాల పై మీకే నమ్మకం సన్నగిల్లి ఇతరుల సాయం కోరతారు.

అనవరస ఖర్చులు మీదపడి ఇబ్బంది పడతారు.

బంధువులు, స్నేహితులతో తరచూ విభేదాలు నెలకొంటాయి.

కొందరు మీ ప్రగతికి ఆటంకాలు కల్పించడం మనోవ్యథ కలిగిస్తుంది.

ఆలోచనలు స్థిరంగా ఉండక డీలా పడతారు.

ఇంటి నిర్మాణాలు చేపట్టినా నెమ్మదిగా కొనసాగుతాయి.

గురుని అనుకూలత వల్ల ఏడాది ద్వితీయార్థం కార్యజయం. స్వల్ప ఆస్తి లాభ సూచనలు. శుభకార్యాల నిర్వహణ వంటి ఫలితాలు పొందుతారు.

విద్యార్థులకు అంచనాలు తప్పినా ఫలితాలు మాత్రం కొంత సంతృప్తినిస్తాయి.

నిరుద్యోగులకు ద్వితీయార్థం కొంత అనుకూల సమయం.

వ్యాపారస్తులకు లాభాలు దక్కినా పెట్టుబడుల్లో జాప్యం వల్ల చికాకులు. ముఖ్యంగా ఇనుము, సిమెంట్‌ వ్యాపారస్తులకు నిరాశ తప్పదు.

ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగల అవకాశం. సమర్థతను నిరూపించుకునేందుకు మరింత శ్రమించాలి.

పారిశ్రామికవేత్తలకు కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. విదేశీ పర్యటనలు తరచూ వాయిదా పడతాయి.

రాజకీయవేత్తలకు ద్వితీయార్థంలో పదవీయోగం.

కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కి ఊరట కలిగిస్తుంది. అయితే పోటీదారులతో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. మొదటి పంట సామాన్యం.

క్రీడాకారులు,న్యాయవాదులు, వైద్య రంగాల వారికి కొంత ఉపశమనం లభిస్తుంది.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, హనుమాన్‌ పూజలు, ఆదిత్యహృదయం పఠనం మంచిది.*_

_*ఇక, చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.*_

_*అదృష్టసంఖ్య–8.*_

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

శ్రీ విశ్వనాథ జ్యోతిషాలయం.
కాగజ్ నగర్& లక్షెటిపేట
M.B.RAJENDRA PRASAD.

_*🐟🐟మీనం🐟🐟*_

_*ఈ రాశివారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.*_

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23 వరకు అర్థాష్టమ రాహువుదోషం కొంత చికాకు పరుస్తుంది.

మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి.

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి.

ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది.

మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధించడంలో విజయం పొందుతారు.

వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాల వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగే అవకాశం. వీరి సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. అయితే అర్థాష్ఠమ రాహుదోషం వల్ల ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల యత్నాలు సఫలం కాగలవు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.

ఇక అర్థాష్టమ రాహు దోషం వల్ల మానసిక అశాంతి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి.

_*వీరు రాహుకే తువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది.*_

_*ఇక,వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–3.*_

_*శుభమస్తు*_