Monday, 30 March 2020

మన తెలుగు జ్ఞాన సంపద. విశ్వ మానవాళికి దీక్షుచి. మన భావితరాల భవిష్యత్. అమ్ములపొది అందరు చదవండి చదివించండి మీ పిల్లలకు నేర్పించండి.

మన తెలుగు జ్ఞాన సంపద. 
 విశ్వ మానవాళికి దీక్షుచి. 
మన భావితరాల భవిష్యత్. 
అమ్ములపొది  అందరు చదవండి  చదివించండి మీ పిల్లలకు నేర్పించండి. 


 దిక్కులు 
(1) తూర్పు, 
(2) పడమర 
(3) ఉత్తరం 
(4)దక్షిణము 

మూలలు 
(1) ఆగ్నేయం, 
(2) నైరుతి,
(3) వాయువ్యం, 
(4) ఈశాన్యం

 వేదాలు
(1)సామవేదం 
(2)ఋగ్వేదం 
(3) యజుర్వేదం 
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

 పంచభూతాలు 
(1) గాలి, 
(2) నీరు,
(3) నిప్పు, 
(4) భూమి,
(5) ఆకాశం,


  పంచేంద్రియాలు 

(1) కన్ను, 
(2) ముక్కు, 
(3) చెవి, 
(4) నాలుక,
(5) చర్మం.

 లలిత కళలు 
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

  పంచగంగలు 
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి, 
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు 

(1) మందారం, 
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం, 
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు 
(1) స్నానం,
(2) పూజ, 
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  
పంచామృతాలు 
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర, 
(5) తేనె.

 పంచలోహాలు 
(1) బంగారం, 
(2) వెండి, 
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు 

(1) అమరావతి, 
(2) భీమవరం, 
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

 షడ్రుచులు 
(1) తీపి,
(2) పులుపు, 
(3) చేదు,
(4) వగరు, 
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు  షడ్గుణాలు

(1) కామం, 
(2) క్రోధం,
(3) లోభం, 
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష, 
(4) శరద్ఋతువు, 
(5) హేమంత,
(6) శిశిర

  సప్త ఋషులు 
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు, 
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, 
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు 
(1) శేషాద్రి,
(2) నీలాద్రి, 
(3) గరుడాద్రి, 
(4) అంజనాద్రి, 
(5) వృషభాద్రి, 
(6) నారాయణాద్రి, 
(7) వేంకటాద్రి.

  సప్త వ్యసనాలు 
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం, 
(4) వేట,
(5) వ్యభిచారం, 
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు 
""""""""""""""""""""""
(1) గంగ, 
(2) యమునా, 
(3) సరస్వతి, 
(4) గోదావరి, 
(5) సింధు,
(6) నర్మద, 
(7) కావేరి.
            
 నవధాన్యాలు 
(1) గోధుమ,
(2) వడ్లు, 
(3) పెసలు,
(4) శనగలు, 
(5) కందులు,
(6) నువ్వులు, 
(7) మినుములు, 
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు 
(1) ముత్యం, 
(2) పగడం, 
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం, 
(7) కనకపుష్యరాగం, 
(8) పచ్చ (మరకతం), 
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు 
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి, 
(4) రాగి, 
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం, 
(8) తగరం, 
(9) కాంతలోహం.

  నవరసాలు
(1) హాస్యం,
(2) శృంగార, 
(3) కరుణ, 
(4) శాంత, 
(5) రౌద్ర, 
(6) భయానక,
(7) బీభత్స, 
(8) అద్భుత,
(9) వీర

  నవదుర్గలు 

(1) శైలపుత్రి, 
(2) బ్రహ్మ చారిణి, 
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత, 
(6) కాత్యాయని, 
(7) కాళరాత్రి, 
(8) మహాగౌరి, 
(9) సిద్ధిధాత్రి.

  దశ సంస్కారాలు 

( 1 ) వివాహం, 
( 2 ) గర్భాదానం, 
( 3 ) పుంసవనం , 
( 4 ) సీమంతం, 
( 5 ) జాతకకర్మ, 
( 6 ) నామకరణం, 
( 7 ) అన్నప్రాశనం, 
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం, 
(10) సమవర్తనం

   దశావతారాలు 
( 1 ) మత్స్య, 
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ, 
( 4 ) నరసింహ, 
( 5 ) వామన, 
( 6 ) పరశురామ, 
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ, 
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు 

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 

తమిళనాడు ~ రామలింగేశ్వరం
 
 తెలుగు వారాలు 
(1) ఆది, 
(2) సోమ, 
(3) మంగళ, 
(4) బుధ, 
(5) గురు, 
(6) శుక్ర, 
(7) శని.

  తెలుగు నెలలు 
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం, 
( 4 ) ఆషాఢం, 
( 5 ) శ్రావణం, 
( 6 ) భాద్రపదం, 
( 7 ) ఆశ్వీయుజం, 
( 8 ) కార్తీకం, 
(9 ) మార్గశిరం, 
(10) పుష్యం, 
(11) మాఘం, 
(12) ఫాల్గుణం.

  రాశులు 

( 1 ) మేషం,
( 2 ) వృషభం, 
( 3 ) మిథునం, 
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం, 
( 6 ) కన్య, 
( 7 ) తుల, 
( 8 ) వృశ్చికం, 
( 9 ) ధనస్సు, 
(10) మకరం, 
(11) కుంభం, 
(12) మీనం.

  తిథులు 
( 1 ) పాఢ్యమి, 
( 2 ) విధియ, 
( 3 ) తదియ, 
( 4 ) చవితి,
( 5 ) పంచమి, 
( 6 ) షష్ఠి, 
( 7 ) సప్తమి, 
( 8 ) అష్టమి, 
( 9 ) నవమి, 
(10) దశమి, 
(11) ఏకాదశి, 
(12) ద్వాదశి, 
(13) త్రయోదశి, 
(14) చతుర్దశి, 
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు 

( 1 ) అశ్విని, 
( 2 ) భరణి, 
( 3 ) కృత్తిక, 
( 4 ) రోహిణి, 
( 5 ) మృగశిర, 
( 6 ) ఆరుద్ర, 
( 7 ) పునర్వసు, 
( 8 ) పుష్యమి, 
( 9 ) ఆశ్లేష, 
(10) మఖ, 
(11) పుబ్బ, 
(12) ఉత్తర, 
(13) హస్త, 
(14) చిత్త, 
(15) స్వాతి, 
(16) విశాఖ, 
(17) అనురాధ, 
(18) జ్యేష్ఠ, 
(19) మూల, 
(20) పూర్వాషాఢ, 
(21) ఉత్తరాషాఢ, 
(22) శ్రావణం, 
(23) ధనిష్ఠ, 
(24) శతభిషం, 
(25) పూర్వాబాద్ర, 
(26) ఉత్తరాబాద్ర, 
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు 

( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :- 
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 
1934, 1994, 2054, 2114

9యువ.  - 
1935, 1995, 2055, 2115

10.ధాత.  - 
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 
1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 
1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 
1943, 2003, 2063, 2123

18.తారణ. - 
1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. - 
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 
1948, 2008, 2068, 2128

23.విరోధి. - 
1949, 2009, 2069, 2129

24.వికృతి. - 
1950, 2010, 2070, 2130

25.ఖర. 
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ. 
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 
1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 
1957, 2017, 2077, 2137

32.విళంబి. 
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి. 
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 
1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 
1967, 2027, 2087, 2147

42.కీలక. 
1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 
1969, 2029, 2089, 2149

44.సాధారణ . 
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 
1971, 2031, 2091, 2151

46.పరీదావి. 
1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 
1973, 2033, 2093, 2153

48.ఆనంద. 
1974, 2034, 2094, 2154

49.రాక్షస. 
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156, 

51.పింగళ                 
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి         
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి              
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                 
1980, 2040, 2100, 2160

55.దుర్మతి              
1981, 2041, 2101, 2161

56.దుందుభి             
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి         
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                 
1984, 2044, 2104, 2164

59.క్రోదన                  
1985, 2045, 2105, 216

60.అక్షయ              
1986, 2046, 2106, 2166.
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..
Pulluri Sai

Saturday, 28 March 2020

corona pledge

Hi all ,
Take a corona pladge from here,and please give awareness to the people
1.open your browser
2. Copy paste below in browser
3.https://www.injntu.com/pledge/
4. Filled  information
5. After filling take a pledge
6 .download the certificate


Thursday, 26 March 2020

మీరు మారాలనుకుంటున్నారా?

✌🏻 మీరు మారాలనుకుంటున్నారా?

 👍🏻 విత్తనం మొక్కవుతుంది. మొక్క చెట్టవుతుంది. చెట్టు మహావృక్షంగా మారి కొన్ని లక్షల విత్తనాలను సృష్టిస్తుంది. ఇది పరిణామక్రమం, మనిషి శరీరం కూడా అలాగే పరిణామం చెందుతుంది, కాని… మనసు సహజ సిధ్ధంగా పరిణామం చెందదు. మనసు పరిణామం చెందాలంటే మనిషి ప్రయత్నం చేసి తీరాలి. మానసికమైన మార్పునకు మనిషి ఆలోచనా వైఖరిలో మార్పు రావాలి. అప్పుడే మార్పును గుర్తించగలం.

ప్రకృతి కూడా ప్రతీ సంవత్సరం ఋతువుల ప్రకారం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలని తపన పడితేనే ఆ మార్పు జరుగుతుంది. ఇది సహజసిద్ధమైనది కాదు. గొంగళిపురుగు ఒక జీవి కనుక మార్పుకు ప్రయత్నం చేస్తుంది. కొన్ని గొంగళిపురుగులు ఆ మార్పు చెందకుండానే జీవితాన్ని చాలిస్తాయి. జీవుల్లో కెల్లా అత్యంత అభివృద్ది చెందిన మనిషి మార్పుకోసం ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే ఆ మనిషి కుటుంబంలో, సమాజంలో మెప్పు పొందగలుగుతాడు, తృప్తిగా జీవించగలుగుతాడు.

మనం సంతోషంగా వుంటూ మన చుట్టుప్రక్కల వారిని సంతోషంగా వుంచాలనుకుంటే మార్పును ఆహ్వానించడం తప్పనిసరి. మనిషిలో మార్పుకు మూలకారకం – ఆలోచనా సరళి. దాన్నే వైఖరి, దృక్పథం అంటాం, ‘నాలో మార్పుకు నేను ఎలా ఆలోచించాలి’ అని ప్రతీ వ్యక్తి ప్రశ్నించుకోవాలి. మార్పుకోసం ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనే తపన తో ‘ ఓపెన్ మైండెడ్’ గా స్వాగతించాలి. పారాషూట్స్ ఓపెన్ చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే మనిషి ‘ఓపెన్ మైండెడ్’గా తపనతో వుంటేనే మార్పు కలుగుతుంది. “నాలో మార్పు అవసరం, నేను మారితీరాలి, నా ఆలోచనా తీరులో నేను మారగలను” అనే తపనతో వుంటే ‘CHANGE’ అనే ఇంగ్లిష్ పదంలోనే సారాంశమంతా కన్పిస్తుంది. అదేంటో చూద్దాం.

🍎 C = CREATE OPPORTUNITIES

H = HANDLE THE SITUATION

A = ACCEPT THEM AS CHANLLENGES

N = NEVER QUIT

G = GAIN KNOWLEDGE

E = EVALUATE YOUR EXPERIENCES

జీవితంలో మార్పు కావాలంటే పై పదంలోని ఒక్కొక్క అక్షరానికి వున్న అర్ధాన్ని అదే క్రమంలో పాటిస్తే మార్పును తప్పనిసరిగా రుచి చూడగలం.

🍎 CREATE OPPORTUNITIES
          అవకాశాలు వాటంతటి అవిరావు. మనం కల్పించుకోవలసిందే. “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా” అనే సినిమా పాట ఉండనే వుంది. కనుక “అదృష్టం,దురదృష్టం, కలిసి రావాలి” అని అనుకుంటూ కూర్చోకుండా అవకాశాలను కల్పించుకోవడమే మార్పుకు మొదటి మెట్టు. మనం వున్న వాతావరణంలోనే వుండి, ఎంతో వృద్ధిలోకి వచ్చిన వారిని అధ్యయనం చేస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్ధమౌతుంది. వారందరూ అవకాశాలను కల్పించుకున్న వారే కాని ఎవరో అవకాశాలను కల్పించి విజయాలను అదించలేదు.

🍎 HANDLE THE SITUATIONS

          అవకాశాలను కల్పించుకున్న తర్వాత క్రొత్త పరిస్థితులు, క్రొత్త అనుభవాలను ఎదుర్కోవటం సహజం. మార్పు మాత్రమే మన ధ్యేయం అనుకుని పరిస్థితులను చాకచక్యంగా, ఓపికగా, పట్టుదలతో జయించగలిగితే మంచి అనుభవం వస్తుంది, వచ్చిన అనుభవంతో మరింత ఉత్తేజంతో ముందుకు సాగాలి.

🍎 ACCEPT THEM AS CHALLENGES

          మార్పుకోసం ప్రతీ విషయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి, సమాధానం లేని సమస్యలు లేవు కనుక ప్రతీ సమస్యను సవాలుగా తీసుకుని పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. ఛాలెంజ్ గా తీసుకోవడమనేది ఒక రకమైన మనస్తత్వం అని నమ్మి ఆలోచనా ప్రక్రియ ద్వారా అటువంటి మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.

🍎 NEVER QUIT

          విజేతలు విడిచి పెట్టరు. విడిచిపెట్టేవారు విజేతలు కాలేరు. ఇది జగమెరిగిన సత్యం. కనుక మార్పుకోసం చేసే ప్రయత్నంలో పట్టుసడలని ప్రయత్నాన్ని అలవాటు చేసుకోవాలి. దానివల్ల మనస్తత్వంలో మార్పు వస్తుంది. తద్వారా జీవితంలో మార్పు వస్తుంది.

🍎 GAIN KNOWLEDGE

          అవకాశాలను సృష్టించుకుని, అవకాశాలను జారవిడవకుండా పరిస్థితులను జాగ్రత్తగా నిర్వహించి, ఛాలెంజ్ గా తీసుకుని, పట్టుదలతో చెయ్యడం వలన ఒక గొప్ప అనుభవం కలుగుతుంది. ఈ కొత్త అనుభవాన్ని నెమరు వేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. విజ్ఞానం వున్నవాడు విజయం వైపుకు దూసుకువెళ్తాడు. అనుభవం తో వచ్చిన విజ్ఞానం మార్పుకు పెద్ద పెట్టుబడి లాంటిది.

🍎 EVALUATE YOUR EXPERIENCES:

          మనకు కలిగిన అనుభవాలను పరీక్షించుకుంటే మనకొక విషయం అర్ధమౌతుంది. ఈ ప్రపంచంలో ప్రతీ విషయం నేర్చుకునే దశలో చాలా కష్టంగానే వుంటుంది. సాధన ద్వారా చాలా సుళువు అవుతుందని మనకు అర్ధమౌతుంది. కనుక ఏదీ కష్టం కాదు అనే మనస్తత్వం అలవాటౌతుంది. ఇది మార్పుకు ఎంతో దోహదపడుతుంది.

          ఉదాహరణకు… సైకిల్ తొక్కడం, అక్షరాలు నేర్చుకోవడం, స్కూటర్ నడపటం, ఈత కొట్టడం లాంటి ప్రతీ పని ప్రారంభదశలో కష్టంగానే అనిపించినా నేర్చుకున్న తర్వాత అది ఎంత సులభమైన విషయమో… అందరికీ అనుభవమే.

          మార్పు ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే మనం ఎప్పుడూ చేసిన పనులనే చేస్తూ వుంటే… ఎప్పుడూ వచ్చిన ఫలితాలే వస్తాయి

Pulluri Enterprises catalogue/services

Pulluri Enterprises catalogue /services
You can download our app from Play Store
#pulluri enterprises
https://play.google.com/store/apps/details?id=com.img.pulluri

Contact:7013650063

*🌷ఈ 4 టిప్స్ ఫాలో అయితే బ్యాంకు ఉద్యోగం గ్యాgరెంటీ🌷*

*🌷ఈ 4 టిప్స్ ఫాలో అయితే బ్యాంకు ఉద్యోగం గ్యాgరెంటీ🌷*

👉డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ.. విద్యార్హత ఏదయినా సరే.. నేతి తరం యువత బ్యాంకు ఉద్యోగాలకై పరుగులు తీస్తోంది. కోచింగ్ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తోంది. ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ.. అంటూ వరుసపెట్టి బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తోంది. మొదటిసారి విఫలం అయినా.. విజయం కోసం మాటిమాటికీ నిరుద్యోగులు బ్యాంకు ఎగ్జాములు రాస్తూనే ఉన్నారు. లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ అంటూ.. కోచింగ్ సెంటర్లు నిరుద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తోంది. కోచింగ్ సెంటర్ల సంగతి పక్కనపెడితే.. మొట్టమొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం సాధించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు. ఓ నాలుగు టిప్స్‌ను పాటిస్తే బ్యాంకు పరీక్షలను మొట్టమొదటి ప్రయత్నంలోనే పాసై.. కొలువులో కొలువుదీరడం గ్యారెంటీ అంటున్నారు. మరి ఆ నాలుగు టిప్స్ ఏంటో ఓ లుక్కేద్దామా..?
 
*🌻1. సిలబస్‌ను తూచా తప్పకుండా ఫాలో అవడం:🌻*

👉పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, క్లర్క్ అంటూ వచ్చే నోటిఫికేషన్స్‌కు వేటికవే సిలబస్ ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ లెవల్స్‌లో కూడా తేడా ఉంటాయి. సిలబస్‌ను తూచా తప్పకుండా పాటించి, అందులోని టాపిక్స్‌ను ఆసాంతం పూర్తి చేస్తే విజయానికి మొదటి మెట్టు ఎక్కినట్లే. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జాములకు అనుగుణంగా ప్రపరేషన్ ఉండాలి.
 
*🌻2. ఆన్సర్లు తెలియకపోతే వదిలేయండి🌻*

👉పరీక్షా సమయంలో ప్రశ్నలను చూసి చాలామంది కంగారుపడుతుంటారు. చదివాను కానీ గుర్తు రావడం లేదేంటని తర్జనభర్జన పడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి చివరకు ‘ఇదే కరెక్ట్ అనుకుంట’ అని ఓ ఆన్సర్‌ను టిక్ చేస్తుంటారు. ఈ పద్ధతికి స్వస్థి చెబితేనే మేలు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వదిలేయండి. అనవసరంగా ఆలోచించి, ఒక్క ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించి అంతిమంగా నష్టపోతారు. అందులోనూ నెగిటివ్ మార్కింగ్ ఉండనే ఉంది.
 
*🌻3. మాక్ టెస్టులు, మోడల్ పేపర్లు🌻*

👉పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి.. అంటుంటారు కదా.. అదే విధంగా బ్యాంకు ఎగ్జాములే కాదు ఏ పరీక్ష అయినా.. గతంలో వచ్చిన ప్రశ్నా పత్రాలు, మోడల్ పేపర్ల అంతు చూడాల్సిందే. ప్రశ్నాపత్రాల సరళి ఎలా ఉంది.. ఇకపై ఎలా ఉండబోతోంది..? వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన సాధించాలి. ఈ ప్రశ్నాపత్రాలను సాధించడం ద్వారా అభ్యర్థుల్లో కాన్ఫిడెంట్ పెరుగుతుంది.
 
*🌻4. టైమ్ మేనేజ్‌మెంట్🌻*

👉బ్యాంకు ఎగ్జామ్‌ల పనిపట్టాలంటే.. ఎంతో ప్రణాళిక ఉండాలి. సిలబస్‌ను ఆసాంతం చదవడమే కాదు. దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిగ్యూట్ చేస్తున్నామా..? లేదా..? అన్నది కూడా చాలా ముఖ్యం. దీనికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్.. అంటూ ప్రతీ కేటగిరీకి సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ పోకుంటే చాలా కష్టం. అందుకే మోడల్ పేపర్లు, మాక్ టెస్టుల్లో పాల్గొంటే మీ సత్తా ఏంటో మీకే తెలుస్తుంది. తద్వారా మీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీకు మీరే సరిదిద్దుకోగలరు. షార్ట్‌కట్‌లను సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవాలి.


*📚📚పదవ తరగతి, తర్వాత ఏం చేయాలి??ఏమి ఎంచుకోవాలి??*📚📚_

_*📚📚పదవ తరగతి,  తర్వాత ఏం చేయాలి??ఏమి ఎంచుకోవాలి??*📚📚_

_*✅సోపానం✅.*_

_*🧶🧶ఇంతటి కీలకమైన దశను దాటిన తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి?*_

 _*♻ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి♻.*_

_*🧶హెచ్ఈసీ :🧶*_

_*సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్ హెచ్ఈసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యా పరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు.*_
_*సంప్రదాయ డిగ్రీ కోర్పులతో పాటు జాబ్ ఓరియెంటెడ్ డిప్లోమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి.*_

_*🛍ఇంటర్మీడియెట్ ఎంపీసీ :.🛍*_

 _*🧶ఇంజనీర్ గా కెరీర్ లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితం పై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్ లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్ లో చేరిన మొదటి రోజు నుంచి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బిట్ శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషి చేయాలి. ఇంజనీరింగ్ కెరీర్ పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగు పెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.*_

_*📗సీఈసీ, ఎంఈసీ :📗*_

 _*🧶వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణ పై ఆసక్తి ఉన్న వారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్ లో నైపుణ్యాలున్నవారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్లు సీఈసీ,*_

_*📘బైపీసీతో వైద్యం📘*_

_*🧶మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కషపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూఫ్ లో ప్రాక్టికల్స్ కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను, ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్ లో చేరి డాక్టర్ గా జీవితంలో స్థిర పడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సు చేయాలి. అందువల్ల ఆసక్తి, కుటుంబ, ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.*_

_*✴నోటిఫికేషన్ కోర్సులు✴*_

_*🧶అర్హత : పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.*_

_*✳కెరీర్ : బ్రాంచ్ కి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెల్గొచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తిచేసింది తడవు తక్షణ ఉపాధి లభిస్తుంది.*_

_*✅ముఖ్యమైనవి✅*_

_*♻ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్*♻_

 _*🧶కరిక్యులం : వర్క్ షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్ మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్.*_

_*✅ఉద్యోగావకాశాలు✅ : ఆటో మెకానిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/ మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లెబారెటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రిషియన్.*_

_*✅మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్✅ :*_
 
_*.🧶ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, వర్క్ షాప్ టెక్నీషియన్, పవప్ ప్లాంట్ ల టెక్నీషియన్, సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.*_

_*✅ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ :*_
 ఉద్యోగావకాశాలు : ఎల క్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ టెస్టర్రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్,థట

_*✅ఎలక్ట్రికల్ టెక్నీషియన్ : ఉద్యోగావకాశాలు : ఎలక్ట్రానిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్ మ్యాన్.*_

_*✅టిఐ/ఐటిసి : ఇండస్ట్రియల్ టైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ టైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.*_

_*✅అర్హత : ఐటీఐ/ఐటీసీ లలోని ట్రేడ్లలో పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.*_

_*🧶కోర్సులు : ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్లకాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.*_

_*📚స్వయం ఉపాధి దిశగా 📚:*_

 _*🛍ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే స్వయం ఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్కు అవసరమైన ఎన్నో కోర్సులను అతి తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే కోర్సుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్, సెల్ ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్ ఫుట్వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ క్రీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, పుట్టవంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.*_

_*కోర్సులు - విభాగాలు*_ 
_*ఇంటర్మీడియెట్*_
_*ఎంపీసీ*_
_*బైపీసీ*_
_*సీఈసీ*_
_*ఎంఈసీ*_
_*హెచ్ఈసీ*_
_*పాలిటెక్నిక్*_
_*సివిల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఆటోమొబైల్
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్
ఈఈఈ, ఈసీఈ
కంప్యూటర్ ఇంజనీరింగ్
ఐటీఐ/ఐటీసీ
ఫిట్టర్
ఎలక్ట్రిషియన్
ఇన్స్ స్ట్రూమెంట్ మెకానిక్
వెల్డర్, టర్నర్, ప్లంబర్
కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
ఇంటర్ వొకేషనల్ కోర్సులు
క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్ మెంట్
అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
వ్యవసాయ పాలిటెక్నిక్ లు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లోమా
వ్యవసాయ పాలిటెక్నిక్ లు గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లోమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా, డిప్లోమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.*_

_*🧶అర్హత ప్రధేశాలు : పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్. పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.*_

_*♻అవకాశాలు : వ్యవసాయ డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సాంత్ర ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.*_

_*♻పాలిటెక్నిక్ కోర్సులు : తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లోమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.*_

_*✳అర్హత : పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్భీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.*_

_*✴మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి.*_

_*☸కెరీర్ : పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్ మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.*_

_*🔯వేతనాలు : చేరిన సంస్థను బట్టి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.*source _KRANTHI sir fb

కరోనా దశలు(స్టేజ్-1,2 & 3) అంటే ఏమిటి?

*కరోనా దశలు(స్టేజ్-1,2 & 3) అంటే ఏమిటి?* 

 *మొదటి దశ:*

 నవిన్ విదేశాల నుండి వచ్చారు.  విమానాశ్రయంలో అతనికి జ్వరం లేదు.  అతన్ని ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు.  అయితే అతన్ని 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో పూర్తిగా ఒంటరిగా ఖైదు చేసుకోమని, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండాలని మరియు ఇంటిని వదిలి బయటకి వెళ్లొద్దని  , మరియు జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని చెప్పివిమానాశ్రయంలో  అఫిడవిట్ పై సంతకం చేయించుకుని ఇంటికి పంపించారు. 
 ఇంటికి వెళ్లి, అతను అఫిడవిట్ యొక్క షరతులను అనుసరించాడు.
 అతన్ని ఇంట్లో ఖైదు చేశారు.
 అతను ఇంటి సభ్యుల నుండి కూడా దూరంగా ఉన్నాడు.

 నవిన్ తల్లి "హే, నీకు ఏమీ జరగలేదు" అన్నారు.  "ఒంటరిగా ఉండకు.  చాలా రోజులైంది ఇంటి ఆహారం తిని, రా కిచిన్ లో నేను వేడి వేడి ఆహారాన్ని అందిస్తాను." అని పిలిచింది. 

 నవిన్ నిరాకరించారు.

 మరుసటి రోజు ఉదయం, మమ్మీ మళ్ళీ అదే మాట చెప్పింది.  ఈసారి నవాంకూర్‌కు కోపం వచ్చింది.  అతను మమ్మీకి అరిచాడు.  మమ్మీ కంటిలో కన్నీళ్ళు కనిపించాయి.  తల్లికి చెడుగా అనిపించింది.

 నవిన్ ఒంటరిగా ఉండిపోయాడు.

 6-7 వ రోజుల తర్వాత నవిన్ కు జ్వరం, జలుబు దగ్గు వంటి లక్షణాలు రావడం ప్రారంభించాయి.  నవిన్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు.  కరోనా పరీక్ష జరిగింది.  అతను పాజిటివ్‌గా మారిపోయాడు.
 అతని కుటుంబ సభ్యులను కూడా పరీక్షించారు.  అవన్నీ నెగెటివ్‌గా మారాయి.
 1 కిలోమీటర్ల వ్యాసార్థంలో పొరుగువారిని ఎక్కువగా ప్రశ్నించారు.  అలాంటి వారందరినీ పరీక్షించారు.  నవిన్ ఇంటి నుండి బయటకు రావడాన్ని ఎవరూ చూడలేదని అందరూ చెప్పారు.
 అతను తనను తాను బాగా వేరుచేసినందున, అతను కరోనాను మరెవరికీ వ్యాప్తి చేయలేదు.
 నవిన్ కి కరోనా లక్షణాలు చాలా తక్కువ.  జ్వరం, జలుబు దగ్గు, శరీర నొప్పి మొదలైనవి.  7 రోజుల చికిత్స తర్వాత, అతను పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చాడు.

 ఇల్లు అంతా కరోనా లేదని నిన్న చెడుగా భావించిన తల్లికి ఈ రోజు కరోనా తీవ్రత అర్థమయ్యింది. 

 విదేశాల నుండి వచ్చిన మనిషిలో మాత్రమే కరోనా ఉంటే మొదటి దశ ఇది.  అతను దానిని మరెవరికీ వ్యాపింప చేయాలేదు.
 *******************************

 *స్టేజ్ 2-కరోనా:*

రాజుకి కరోనా ఉందని టెస్టు ద్వారా నిర్దారణ అయ్యింది. దానితో అధికారులు తన  మునుపటి రోజుల సమాచారం మొత్తం అడిగారు.  అతను విదేశాలకు వెళ్ళలేదని తేలింది.  కానీ అతను ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని కలిశానని చెప్పాడు.  మొన్న  అతను నగలు కొనడానికి ఒక ఆభరణాల షాపువద్దకు వెళ్ళాడు.  ఆ షాపు యజమాని ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చారు. షాపు యజమాని విదేశాల నుండి వచ్చినప్పుడు విమానాశ్రయంలో  అతనికి జ్వరం లేదు.  అందుకే అతన్ని ఇంటికి వెళ్ళడానికి షరతులతో అనుమతించారు. అతన్ని 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో ఖైదు చేసుకోమని, బయటకి వెళ్లొద్దని  విమానాశ్రయంలో అఫిడవిట్ ఇచ్చారు, మరియు జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని చెప్పి ఇంటికి పంపించారు. 
కానీ అతను అఫిడవిటులో నింపిన షరతులను పాటించలేదు. 
 అతను ఇంట్లో కలియతిరిగాడు, కుటుంబసభ్యులతో కలిసి  తిన్నాడు మరియు మరుసటి రోజు అతను తన ఆభరణాల దుకాణానికి వెళ్ళాడు.
 (మీకు పిచ్చి ఉందా! ఇది సీజన్, మిలియన్ల అమ్మకాలు ఉన్నాయి, ఆభరణాల వ్యాపారి  తన దుకాణాన్ని మూసివేయడు. )

 6 వ రోజు ఆ యజమానికి జ్వరం వచ్చింది.  అతని కుటుంబంలోని వారికి కూడా జ్వరం వచ్చింది.  కుటుంబ సభ్యులలో వృద్ధ తల్లి కూడా ఉంది. అందరిపై దర్యాప్తు జరిగింది.  దర్యాప్తులో అందరికి కరోనా ఉందని రిపోర్టులు వచ్చాయి.

 అంటే, విదేశాల నుండి వచ్చిన వ్యక్తి స్వయంగా పాజిటివ్. అప్పుడు అతను హౌస్‌మేట్స్‌ను కూడా పాజిటివ్‌గా చేశాడు. 
 అదనంగా, అతను దుకాణంలో 450 మందితో పరిచయం ఏర్పడ్డాడు.  సేవకులు, కస్టమర్లు మొదలైనవారు. వారిలో ఒకరు రాజు. మొత్తం 450 మందిని తనిఖీ చేస్తున్నారు.  వాటిలో పాజిటివ్ ఉన్నప్పటికీ ఇది *రెండవ దశ* .

 *భయం ఏమిటంటే, ఈ 450 మందిలో ప్రతి ఒక్కరికి వారు ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవచ్చు.* 

 మొత్తంమీద, స్టేజ్ 2 అంటే కరోనా పాజిటివ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి విదేశాలకు వెళ్ళలేదు.  కానీ అతను ఇటీవల విదేశాలకు వచ్చిన వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాడు.
 *******************************

 *స్టేజ్ 3* 

 జలుబు దగ్గు జ్వరం కారణంగా రామ్‌సింగ్ ఆసుపత్రి పాలయ్యాడు, అక్కడ కరోనా పాజిటివ్ వచ్చింది.
 కానీ రామ్‌సింగ్ కూడా విదేశాలకు వెళ్ళలేదు.
 అతను ఇటీవల విదేశాలకు వచ్చిన ఎవరితోనూ పరిచయం చేయలేదు.

 అంటే, రామ్‌సింగ్ చివరకు ఎక్కడ నుండి కరోనాను అనుభవించాడో మనకు తెలియదు.

 స్టేజ్ 1 లో మనిషి స్వయంగా విదేశాల నుండి వచ్చాడు.

 2 వ దశ మూలం షాపు యజమాని అని తెలుసు.  మేము షాపు యజమానిని  మరియు అతనితో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని పరీక్షించాము మరియు అతనిని 14 రోజులు వేరుచేసాము.

 3 వ దశలో మీకు మూలం(అంటే ఎవరి నుంచి వచ్చింది) తెలియదు.

  మనకు మూలం తెలియకపోతే, మనం  మూలాన్ని సంగ్రహించలేము.  దానిని వేరుచేయలేము. ఆ మూలం ఎక్కడ ఉంటుందో మరియు  వారి వలన అనుకోకుండా ఎంత మందికి సోకుతుందో..?? 🥵❗

 *3 వ దశ ఎలా చేయబడుతుంది?*

 షాపు యజమానితో పరిచయం ఉన్న 450 మంది.  యజమాని కరోనాని   వ్యాపింపచేసాడనే వార్త తెలియగానే అతని కస్టమర్లు, పనిమనిషి, ఇంటి పొరుగు, షాప్ పొరుగు, మిల్క్ మాన్, పేపర్ బాయ్, చాయ్ వాలా… అందరూ ఆసుపత్రికి పరిగెత్తారు. అందరూ మొత్తం 440 మంది ఉన్నారు. 10 మంది ఇప్పటికీ కనుగొనబడలేదు. పోలీసులు, ఆరోగ్య శాఖ బృందం వారి కోసం వెతుకుతోంది. ఆ 10 మందిలో ఎవరైనా దేవాలయంలోకి ప్రవేశిస్తే ఈ వైరస్ చాలా వ్యాపిస్తుంది.
 ఇది స్టేజ్ 3 , ఇక్కడ మీకు మూలం తెలియదు.

 *స్టేజ్ 3 పరిహారం*
 14 రోజుల లాక్డౌన్
 కర్ఫ్యూ విధించండి. నగరాన్ని 14 రోజులు లాక్ చేయండి. ఎవరినీ బయటకు రానివ్వవద్దు.

 *ఈ లాకౌట్తో ఏమి జరుగుతుంది ??* 

 ప్రతి మనిషి ఇంట్లో లాక్ చేయబడతాడు.
 సోకిన వ్యక్తితో పరిచయం లేని వ్యక్తి సురక్షితంగా ఉంటాడు.
 తెలియని మూలం కూడా అతని ఇంట్లో లాక్ చేయబడింది.  అతను అనారోగ్యానికి గురైనప్పుడు, అతను ఆసుపత్రికి వస్తాడు.  మరియు ఇది తెలియని మూలం అని మేము తెలుసుకుంటాము.

 ఈ తెలియని మూలం వారి ఇంటి నుండి మరో 4 మందికి సోకినట్లు ఉంది, కాని మిగిలిన నగరం బయటపడింది.

 *LOCKDOWN* లేకపోతే ఆ మూలం (కరోనా ఉన్న వాళ్ళని) పట్టుకోలేక పోయేవాళ్లం. అలాంటి వేలాది మందిలో అతను కరోనాను వ్యాప్తి చేసేవాడు.  అప్పుడు తెలియని   వేలమంది ప్రజలు దీనిని మిలియన్ల మందిలో వ్యాప్తి చేస్తారు.  అందుకే నగరం మొత్తం లాక్డౌన్ వలన కరోనా నుండి బయటపడింది మరియు తెలియని మూలం పట్టుబడింది.

 * స్టేజ్ 2, స్టేజ్ 3 లో మార్చవద్దు. *

 ప్రారంభ లాక్డౌన్ అంటే దశ 3 రాకముందే లాకౌట్.
 ఈ లాక్డౌన్ 14 రోజుల కన్నా తక్కువ ఉంటుంది.

 ఉదాహరణకు
 షాపు యజమాని విమానాశ్రయం నుండి బయలుదేరిన అప్పటి నుంచి వారు ఇల్లు అంతా కరోనా ఇచ్చింది. ఉదయం నిద్రలేచి  షాపుకి వెళ్ళాడు.
 (అద్భుత మనిషి! ఇది సీజన్, లక్షలాది వ్యాపారం  అమ్ముడవుతోంది, దుకాణాన్ని ఎలా మూసివేయాలి)

 కానీ లాకౌట్ ఉన్నందున.
 దాంతో పోలీసులు కర్రతో షాపు యజమాని వైపు పరుగెత్తారు. కర్రను చూసిన యజమాని దుకాణం షట్టర్ మూసివేశి పారిపోయాడు.

 మార్కెట్ ఇప్పుడు మూసివేయబడింది కాబట్టి.
 కాబట్టి 450 మంది కస్టమర్లు కూడా రాలేదు. కాబట్టి అందరూ బయటపడ్డారు.
 రాజు కూడా బయటపడ్డాడు.
 షాపు యజమాని కుటుంబానికి మాత్రమే కరోనా పరిమితమయ్యేది.

 *కరోనా మనకి సోకిన 6 నుండి 7 వ రోజు నాటికి, కరోనా లక్షణాలు కనిపిస్తాయి. అప్పటి వరక మనం చూడడానికి ఆరోగ్యంగా ఉన్నా మనలో వైరస్ ఉన్నట్లే. ఒకవేల ఎటువంటి లక్షణాలు లేకపోతే కరోనా నెగటివ్(లేదని) అని అర్థం.*

ఇప్పుడు మన ముందున్నది కేవలం ప్రభుత్వం చెప్పినట్లు పాటించడమే.. అంటే ఇంటినుండి కొన్ని రోజుల వరకు బయటకీ రాకుండా ఉండేంటం.

 *షేర్ చేయడం మరవొద్దు..*
Source fb

Tuesday, 24 March 2020

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_
_*🦙మేషం🦙*_

_*వీరికి ఏడాది ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1గా ఉంటుంది.*_

వీరికి సంవత్సరమంతా గురుడు, సెప్టెంబర్‌ 23 వరకు రాహువు యోగదాయకులు. శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు.
ప్రారంభం నుంచి అన్ని విధాలా అనుకూల సమయమే.
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.
భవిష్యత్తు మరింత బంగారుమయంగా కనిపిస్తుంది.
ఇతరులు సైతం మిమ్మల్ని మెచ్చుకునే సమయం.
అందరిలోనూ ప్రత్యేక గౌరవమర్యాదలు పొందుతారు.
స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది.
చిరకాల ప్రత్యర్థులు కూడా మీకు శిరస్సు వంచుతారు.
దైవ కార్యాలలో పాల్గొంటారు.
ఆశ్చర్యకరమైన రీతిలో విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు.
నిరుద్యోగులకు ఊహించని రీతిలో ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం.
ఉద్యోగస్తులు గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు అధిగమిస్తారు.
వ్యాపారులు మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుట్టి లాభాల దిశగా పయనిస్తారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభసాటిగా ఉంటాయి.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. అత్యుత్తమ పురస్కారాలు సైతం అందుకునే వీలుంది.
రాజకీయవేత్తలకు మరిన్ని పదవులు దక్కే సూచనలు, వీరికి ఏడాది మంచి ఆదరణ లభిస్తుంది.
కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.
క్రీడాకారులు, న్యాయవాదులకు ఊహించని అభివృద్ధి ఉంటుంది.
సెప్టెంబర్‌ 23 నుంచి రాహువు ద్వితీయ రాశిలో ప్రవేశంతో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, వివిధ వృత్తుల వారికి మార్పులు జరిగే వీలుంటుంది.
_*వీరు రాహువు, శనికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరారాధన మంచిది.*_
_*చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యం.

_*🐂వృషభం🐂*_

_*వీరికి ఈ ఏడాది ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం –1గా ఉంటుంది.*_
ఇక వీరికి కుటుంబ స్థానంలో సెప్టెంబర్‌ 23 వరకు, తదుపరి జన్మ స్థానంలో రాహు సంచారం, అలాగే, మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు గురుడు భాగ్య స్థానంలో అతిచారం సంచార కాలం శుభదాయకంగ ఉంటుంది. తదుపరి నవంబర్‌ 20 వరకు అష్టమ స్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్య స్థానంలో సంచారం విశేష యోగకాలం.
ఇక శని కొంత వరకూ యోగాన్నిస్తాడు.
మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన పైకం చేతికందుతుంది.
చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.
తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.
శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండడం మంచిది.
నిరుద్యోగులకు నవంబర్‌ నుంచి శుభదాయకంగా ఉంటుంది,
విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.
వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి.
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ద్వితీయార్థంలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగుతారు.
కళాకారులు క్రమేపీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు కొన్ని తప్పిపోయినా అధైర్యపడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.
క్రీడాకారులకు అనుకూల సమయమని చెప్పాలి.
వీరు ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ వహించాలి.
_*గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది.*_
_*జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలిస్తాయి. మిగతావి సామాన్యం.*_
_*అదృష్టసంఖ్య–6.*

_*👨‍❤️‍👨మిథునం👨‍❤️‍👨*_

_*వీరికి  ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.*_

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తదుపరి నవంబర్‌ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్‌ 29 నుంచి వవంబర్‌ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి.
మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.
ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.
తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.
ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.
మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.
తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.
సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.
అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.
అయితే జూన్‌– నవంబర్‌ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.
అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి.
విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.
ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.
కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది.
టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.
_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్యహృదయం పఠించాలి.*_
_*చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_
_*అదృష్టసంఖ్య–5.*_

_*🦀కర్కాటకం🦀*_

_*ఈ రాశి వారికి ఆదాయం –11, వ్యయం–8, రాజపూజ్యం–5, అవమానం–4గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు శుభుడు, తదుపరి నవంబర్‌ 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమ స్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్‌ 23 నుంచి రాహువు లాభ స్థానంలో శుభుడు.
మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి.
ముఖ్యమైన కార్యక్రమాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు.
ఆలోచనలు అంతగా కలసిరావు.
కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.
ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి.
ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా హోమాలు, యజ్ఞాల వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకుంటారు.
మిత్రులు, బంధువుల నుంచి తరతూ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.
అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగడం వల్ల కొంత అనుకూలత పొందుతారు.
నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగ లాభం.
విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేందుకు చేసే కృషి ఫలిస్తుంది.
వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములు ముందుకు రాకపోవడంతో డీలా పడతారు. విస్తరణలోనూ ఆటంకాలు.
ఉద్యోగస్తులకు అదనపు పనిభారం మీదపడుతుంది. అయితే నవంబర్‌నుంచి శుభదాయకంగా ఉంటుంది.  కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమైన సమయమని చెప్పాలి.
రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు.
కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి.
క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.
_*వీరు, శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.*_
_*ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యం.*_
_*అదృష్టసంఖ్య–2.*_

_*🦁సింహం🦁*_

_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–1, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి షష్ఠమ స్థానంలో సంచరించిన కాలంలో సామాన్య స్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారంపరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

జూన్‌ 29 నుంచి నవంబర్‌వరకు గురుని పంచమ స్థానంలో సంచారం శుభదాయకం.  ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే.
మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి.
వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

కోర్టుల్లో కొన్నేళ్లుగా నలుగుతున్న కేసులు పరిష్కారమయ్యే అవకాశం.
ఆస్తులు కొనుగోలు చేస్తారు.
ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే, ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి.
ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు.
కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం.
ఇంట్లో శుభకార్యాల నిర్వహణ.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకోవడంలో కృతకృత్యులవుతారు.
నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.
వ్యాపారస్తులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అలాగే, భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయం. ముఖ్యంగా లోహాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం.
ఉద్యోగులకు చిరకాల సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పదోన్నతులు దక్కుతాయి. అలాగే, పై స్థాయి వారి సహాయం సంపూర్ణంగా అందుతుంది.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.  వీరికి మరింత గుర్తింపు లభిస్తుంది.
కళాకారులు అనుకున్న అవకాశాలు జాప్యం లేకుండా పొందుతారు. కొందరికి అవార్డులు దక్కవచ్చు.
క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు.
రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.
గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.
_*వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి.*_
_*చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి సామాన్యం.*_
_*అదృష్ట సంఖ్య....1.*_

_*🤰కన్య🤰*_

_*ఈ రాశి వారికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూలమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూల సమయంగా భావించాలి.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధన లాభాలు ఉండవచ్చు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

తరచూ దైవకార్యాలు చేపడతారు.

అలాగే, అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.
సంతానపరంగా మరింత సౌఖ్యం, వారి విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు. అలాగే, మంచి ర్యాంకులు సాధిస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇనుము, కలప, బంగారం వంటి వ్యాపారాలు చేసే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు ప్రథమార్ధంలో ఆకస్మిక బదిలీలు అవకాశాలు. ద్వితీయార్థంలో పదోన్నతులు దక్కే అవకాశం.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు తథ్యం. ముఖ్యంగా కార్యజయం.
రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ, పదవీయోగాలు కలుగుతాయి.
వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో అధికంగా లాభాలు గడిస్తారు.
క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాద వృత్తుల వారికి గతం కంటే మరింత మెరుగైన కాలమని చెప్పాలి.
గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లబిస్తుంటుంది.
_*ఇక వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, శ్రీ కృష్ణాష్టోత్తరం, అన్నపూర్ణాష్టక పఠనం మంచిది.*_
_*ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_
_*అదృష్టసంఖ్య–5.*_

_*⚖️తుల⚖️*_

_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్‌వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి ఏ కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది.

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

_*వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్‌ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.*_

_*చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య –6*_

_*🦂🦂వృశ్చికం🦂🦂*_

_*వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.*_

ఇక వీరికి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి.

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి.

ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

క్రీడాకారులు, టెక్నికల్‌ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

_*వీరు నవంబర్‌ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.*_

_*చైత్రం, వైశాఖం, ఆషాఢం,  శ్రావణం,  ఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_
అదృష్ట సంఖ్య.   9

_*🏹🏹ధనుస్సు🏹🏹*_

_*ఈ రాశి వారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం–3గా ఉంటుంది.*_

ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్‌ 30 నుంచి నవంబర్‌ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయ రాశి సంచారంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు.

ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉపశమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్‌ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురుడు ఒక్కడే వీరికి అనుకూలమని చెప్పాలి.

ఆర్థికంగా ప్రధమార్థంలోనూ, చివరిలోనూ విశేషంగా కలసివస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే, జ్ఞాతుల నుంచి కొంత సొమ్ము అందుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా కొంత శ్రమానంతరం పూర్తి కాగల సూచనలు.

బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

స్థిరాస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో తొలగే సూచనలు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర కలసివస్తాయి.

జీవిత భాగస్వామితో కొంత విభేదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టర్లకు ప్రథమార్థం విశేష లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కించుకునే చాన్స్‌.

నిరుద్యోగులకు ప్రథమార్థంలో శుభవార్తలు అందుతాయి.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకున్న పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థం చివరిలో మరింత రాణిస్తుంది.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు శుభదాయకంగా గడుస్తుంది. అయితే మధ్యలో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి.

రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదురైనా నెట్టుకొస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి.

_*వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది.*_

_*ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉంటుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి.*_

_*అదృష్ట సంఖ్య–3.*_

_*🐊🐊మకరం🐊🐊*_

_*ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది.*_

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్‌ 23 నుంచి అనుకూలం.

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి.

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.*_

_*ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–8

_*⚱️⚱️కుంభం⚱️⚱️*_

_*వీరికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–6గా ఉంటుంది.*_

ఇక వీరికి ఏల్నాటి శని దోషం అధికంగా ఉంటుంది. అలాగే, వ్యయస్థానంలో అంటే మార్చి 29 నుంచి జూన్‌ 29వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి గురు సంచారం కూడా ప్రతిబంధకంగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో గురుబలం కాస్త ఊరటనిస్తుంది.

అలాగే, సెప్టెంబర్‌ 23 నుంచి అర్థాష్టమ రాహు దోషం కూడా తోడై ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద వీరికి ఏడాది మధ్యకాలం మినహా మిగతా కాలమంతా చికాకులు తప్పవు.

జూలై–నవంబర్‌ మధ్య కాలం వీరికి విశేషంగా కలసివస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అలాగే, సంతానపరంగా మరింత సౌఖ్యం. కొందరికి సంతానప్రాప్తి కలిగే అవకాశాలు.

శని ప్రభావం వల్ల ఖర్చులతో పాటు వ్యయప్రయాసలు ఎదురై చికాకు పరుస్తాయి.

ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేయడంలో మీ శక్తిసామర్థ్యాల పై మీకే నమ్మకం సన్నగిల్లి ఇతరుల సాయం కోరతారు.

అనవరస ఖర్చులు మీదపడి ఇబ్బంది పడతారు.

బంధువులు, స్నేహితులతో తరచూ విభేదాలు నెలకొంటాయి.

కొందరు మీ ప్రగతికి ఆటంకాలు కల్పించడం మనోవ్యథ కలిగిస్తుంది.

ఆలోచనలు స్థిరంగా ఉండక డీలా పడతారు.

ఇంటి నిర్మాణాలు చేపట్టినా నెమ్మదిగా కొనసాగుతాయి.

గురుని అనుకూలత వల్ల ఏడాది ద్వితీయార్థం కార్యజయం. స్వల్ప ఆస్తి లాభ సూచనలు. శుభకార్యాల నిర్వహణ వంటి ఫలితాలు పొందుతారు.

విద్యార్థులకు అంచనాలు తప్పినా ఫలితాలు మాత్రం కొంత సంతృప్తినిస్తాయి.

నిరుద్యోగులకు ద్వితీయార్థం కొంత అనుకూల సమయం.

వ్యాపారస్తులకు లాభాలు దక్కినా పెట్టుబడుల్లో జాప్యం వల్ల చికాకులు. ముఖ్యంగా ఇనుము, సిమెంట్‌ వ్యాపారస్తులకు నిరాశ తప్పదు.

ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగల అవకాశం. సమర్థతను నిరూపించుకునేందుకు మరింత శ్రమించాలి.

పారిశ్రామికవేత్తలకు కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. విదేశీ పర్యటనలు తరచూ వాయిదా పడతాయి.

రాజకీయవేత్తలకు ద్వితీయార్థంలో పదవీయోగం.

కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కి ఊరట కలిగిస్తుంది. అయితే పోటీదారులతో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. మొదటి పంట సామాన్యం.

క్రీడాకారులు,న్యాయవాదులు, వైద్య రంగాల వారికి కొంత ఉపశమనం లభిస్తుంది.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, హనుమాన్‌ పూజలు, ఆదిత్యహృదయం పఠనం మంచిది.*_

_*ఇక, చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.*_

_*అదృష్టసంఖ్య–8.*_

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

శ్రీ విశ్వనాథ జ్యోతిషాలయం.
కాగజ్ నగర్& లక్షెటిపేట
M.B.RAJENDRA PRASAD.

_*🐟🐟మీనం🐟🐟*_

_*ఈ రాశివారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.*_

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23 వరకు అర్థాష్టమ రాహువుదోషం కొంత చికాకు పరుస్తుంది.

మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి.

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి.

ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది.

మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధించడంలో విజయం పొందుతారు.

వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాల వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగే అవకాశం. వీరి సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. అయితే అర్థాష్ఠమ రాహుదోషం వల్ల ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల యత్నాలు సఫలం కాగలవు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.

ఇక అర్థాష్టమ రాహు దోషం వల్ల మానసిక అశాంతి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి.

_*వీరు రాహుకే తువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది.*_

_*ఇక,వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–3.*_

_*శుభమస్తు*_

కరోనా త్యాగభూమిలో నీ ఆటలు సాగవుతిరగళి పిండితో వ్యాధులను మాన్పిన సాధువులెవరో!

కరోనా త్యాగభూమిలో నీ ఆటలు సాగవు
తిరగళి పిండితో వ్యాధులను మాన్పిన సాధువులెవరో!
విభూతిమహిమతో వ్యధలను తీర్చిన యోగులెవరో!
కనుచూపుతో ప్రకృతిని శాసించిన పతీవ్రతలెవరో!
దేశ రక్షణకై సర్వస్వాన్ని అర్పించిన త్యాగులెవరో!
ధర్మరక్షణకై తమ తపోబలాన్ని ధారవోసిన తాపసులెవరో!
యమధర్మరాజును గడగడలాడించిన శీలవతులెవరో!
వారందరి ప్రతిరూపాలే
కరోనా మహమ్మారినుండి మనలను కాపాడడం కొరకు
తమ ప్రాణాలను ఫణంగాపెట్టి
అహరహరము సేవలందిస్తున్న
మన వైధ్యులు,పోలీసులు,నాయకులు,మీడియా మిత్రులు
ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న ఇతరులు
వారి శ్రమను అర్థంచేసుకుందాం-వారిని కాపాడుకుందాం
వారి సూచనలు పాటిద్దాం-కరోనాను ఖతం చేద్దాం
వారి ఋణం తీర్చుకోవడమంటే-                                                                                  వారిసూచనలను పాటించడమే 
    వారందరికీ పాదాభివందనాలర్పిస్తూ.............
                                శ్రీరాం సత్యనారాయణ
                                  ఆ.క.సం.సభ్యులు
                                      ఆసీఫాబాదు

Saturday, 14 March 2020

కరోనా వస్తే ఇలా

కరోనా వస్తే ఇలా

కరోనా వైరస్‌ ఒంట్లో చేరిన తర్వాత ఏమౌతుంది? అనే దానిపై ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌’ కీలక సమాచారాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..

1-3 రోజులు లక్షణాలు ఆరంభం

* మొదట్లో ముక్కు, గొంతు ద్వారా శ్వాసకోశ సమస్యల లక్షణాలు కనిపిస్తాయి.
* మొదటి రోజే కొద్దిగా జ్వరం వస్తుంది.
* మూడో రోజు నుంచి దగ్గు, గొంతు నొప్పి ప్రారంభంఅవుతాయి

వ్యాధి లక్షణాల దశ
శరీరంలోకి ఈ వైరస్‌ ప్రవేశించిన తర్వాత 14 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది.  అయితే... లక్షణాలు బహిర్గతం కావడానికి పట్టే సమయం సగటున  5 రోజులని చైనాలో పరిశోధనలో తేలింది.

బాధితుల్లో ఇలాంటి లక్షణాలు 80% మందిలో కనిపిస్తాయి


4-9 రోజులు ఊపిరితిత్తుల్లోకి

* వ్యాధికారక వైరస్‌ 3-4 రోజుల్లో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది
* 4-9 రోజులకు శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది
* 8-15 రోజుల వ్యవధిలో ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశముంది

వైరస్‌ బాధితుల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్లు 14%


8-15 రోజులు రక్తంలోకి చేరిక

* ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరుతుంది.
* వారం ముగిసేసరికి... విషతుల్యమై ప్రాణహాని స్థాయికి చేరుతుంది

ఐసీయూలో చేర్చాల్సిన అవసరం వస్తున్న వారు 5%


మూడో వారం అత్యంత కీలక దశ

21 రోజుల తర్వాత బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి కావడమో, అరుదుగా చనిపోవడమో జరుగుతుంది

* డిశ్ఛార్జి: సహజంగా 18-25 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు తగ్గి బాధితులు ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇలా సురక్షితంగా బయటపడుతున్న బాధితుల సంఖ్య 95% కంటే అధికమే.
* సాధారణంగా 15-22 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు ముదిరి బాధితులు చనిపోతున్నారు. ఇదీ ఇతరత్రా జబ్బులున్న వారిలోనే ఎక్కువ..  ఇప్పటివరకు ఇలాంటి మరణాల రేటు అత్యల్పంగా నమోదవుతోంది.

*🌹నేడు పై (π ) దినోత్సవం🌹*@14-03-2020


*పై* యొక్కవిలువ 3.14159 ఈ విలువ ఆధారంగా గణిత శాస్త్రవేత్తలు, మేధావులు ప్రతీ సంవత్సరం 3 నెల 14 వ తేదిన "పై డే "గా జరుపుకుంటారు.

గణితంలో వాడే ఒక గుర్తు పేరు పై  " π" .
π (పై) యొక్క విలువ 22/7

ఒక వృత్తం వ్యాసం 1 అయితే, దాని చుట్టుకొలత π అవుతుంది.

పై (Pi) లేదా π అనేది చాలా ముఖ్యమైన గణిత స్థిరాంకాలలోఒకటి. దీని విలువ సుమారుగా 3.14159.

యూక్లీడియన్  జియోమెట్రీలో  ఒక వృత్తం యొక్క వైశాల్యం, మరియు అదే వృత్తం యొక్క అర్ధ వ్యాసం యొక్క వర్గంలనిష్పత్తిని "పై" అనే గుర్తుతో సూచిస్తారు.  గణితం, సైన్సు, ఇంజినీరింగ్ వంటి అనేక శాస్త్రాలలో వాడే  సమీకరణాలలో "π" గుర్తు తరచు వస్తూంటుంది.

"పై" అనేది ఒక కరణీయ సంఖ్య (irrational number) - అంటే రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తి లేదా 'భిన్నం' గా దానిని తెలుపలేము. తత్ఫలితంగా పై యొక్క దశాంక రూపం  (decimal representation) ఎప్పటికీ ముగియదు లేదా పునరుక్తి కాదు. అంతే కాదు. అది ఒక transcendental number కూడాను. అంటే పూర్ణ సంఖ్యలతో పరిమితమైన algebraic operations ద్వారా (వర్గీకరణ, వర్గమానము, కూడిక, హెచ్చవేత వంటివి) 'పై' విలువను సాధించలేము. 

గణిత శాస్త్రం చరిత్రలో 'పై' విలువను మరింత నిర్దిష్టంగా కనుగోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ సంఖ్య పట్ల, దాని భావాలు, రహస్యాల పట్ల సాంస్కృతికంగా కూడా చాలా fascination నెలకొంది.
'చుట్టుకొలత'ను ఆంగ్లంలో  perimeter అంటారు. దీనికి గ్రీకు పదం "περίμετρος". ఆ పదంలోని మొదటి అక్షరమైన πను ఈ విలువకు సంకేతంగా గణిత శాస్త్రవేత్త విలియమ్ జోన్స్  బహుశా 1706లో మొదటిగా వాడి వుండవచ్చును. తరువాత కొంత కాలానికి లియొనార్డ్ ఆయిలర్  ద్వారా ఇది బహుళ ప్రచారంలోకి వచ్చింది. దీనిని కొన్ని సందర్భాలలో వృత్త స్థిరరాశి (circular constant) అనీ, ఆర్కిమెడీస్ స్థిరరాశి,
లుడోల్ఫ్ సంఖ్య అనీ కూడా ప్రస్తావిస్తారు.

యూక్లీడియన్ సమతల రేఖాగణితంలో, π నిర్వచనం - ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వ్యాసముల నిష్పత్తి

 'పై' విలువను ఇలా చెప్పవచ్చును - ఒక వృత్తం యొక్క వైశాల్యానికి, ఆ వృత్తపు అర్ధవ్యాసం భుజంగా కలిగిన చతురస్రం వైశాల్యానికి ఉన్న నిష్పత్తి.

రేఖా గణితపు చాపం యొక్క పొడవు, వైశాల్యాలతో సంబంధం లేకుండా ఇతర విధాలుగా కూడా 'పై'ను నిర్వచింపవచ్చును. ఉదాహరణకు: త్రికోణమితి ఫంక్షన్ "కొసైన్" ద్వారా. కాస్ (x) = 0 అయ్యే అతి తక్కువ ధనసంఖ్య xకు రెట్టింపు విలువ.

π ఒక కరణీయ సంఖ్య - అంటే దానిని రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా తెలుపడం సాధ్యం కాదు. ఈ విషయం  1761 లో జోహాన్ హెన్రిక్ లాంబర్ట్ ఋజువు చేశాడు.20వ శతాబ్దంలో integral calculus కంటే ఎక్కువ పరిజ్ఞానం లేకుండానే ఈ విషయాన్ని ఋజువు చేసే విధానం కనుగొనబడింది. 

వీటిలో ఇవాన్ నివెన్ కనుగొన్న విధానం ఎక్కువ మందికి తెలుసు.[ఇలాంటిదే కాని అంతకు ముందే ఒక ఋజువు మేరీ కార్ట్‌రైట్ద్వారా తెలుపబడింది.

అంతే కాకుండా π ఒక ట్రాన్సెండంటల్ సంఖ్య కూడాను. ఈ విషయం 1882లో ఫెర్డినాండ్ వాన్ లిండ్‌మన్ ఋజువు చేశాడు. దీని అర్ధం ఏమంటే - రేషనల్ (అకరణీయ) సంఖ్యలు coefficients గా కలిగిన ఏ పాలినామియల్‌కూ π అనేది ఒక మూలము‌గా ఉండడం జరుగదు.

 π యొక్క ఈ transcendence కారణంగా అది కన్‌స్ట్రక్టిబుల్ సంఖ్య కాదు. అంటే ఏమిటి? - రేఖా గణితంలో కంపాస్ మరియు లంబకోణం ల ద్వారా గోయడానికి సాధ్యమైన అన్ని బిందువులూ constructible numbers. ఒక వృత్తానికి వర్గం నిర్మించడం సాధ్యం కాదు. అనగా కేవలం compass మరియు straightedge లు మాత్రమే వినియోగిస్తూ ఒక వృత్తానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రాన్ని నిర్మించడం సాధ్యం కాదు.

π యొక్క ట్రంకేటెడ్ విలువ 50 దశాంశ స్థానాల వరకు ఇలా ఉంది.
3.14159 26535 89793 23846 26433 83279 50288 41971 69399 37510
"పై" విలువను 10 వేల కోట్ల (ట్రిలియన్ అనగా (1012)) స్థానాలవరకు గుణించారు.కాని సాధారణంగా వాడే లెక్కలకు (ఉదాహరణకు వృత్తం యొక్క వైశాల్యం కనుగోవడానికి) ఒక డజను కంటే మించిన స్థానాల విలువ అవుసరపడదు. ఉదాహరణకు మనము శోధించగలిగిన విశ్వం పరిమాణంలో పట్టే ఎంత పెద్ద వృత్తం చుట్టుకొలతనయినా గాని 39 స్థానాల 'పై' విలువతో గనుక లెక్కిస్తే వచ్చే ఫలితంలోని అంచనాల వ్యత్యాసం హైడ్రోజన్ పరమాణువు యొక్క సైజు కంటే మెరుగుగా ఉంటుంది. .

π ఒక కరణీయ సంఖ్య గనుక దాని దశాంశ సంఖ్యలు ఎంతకూ ముగియవు లేదా పునరావృతం కావు. ఈ గుణం వల్ల 'పై' అంటే గణిత శాస్త్రజ్ఞులకూ, సామాన్యులకూ చాలా ఉత్సుకత కలుగజేస్తుంది. 

గడచిన కొద్ది శతాబ్దాలలో పై విలువ కనుగోవడానికీ, దాని ఇతర లక్షణాలు కనుగోవడానికీ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.సూపర్ కంప్యూటర్‌ల ద్వారా ఎన్నో లెక్కలు వేయబడ్డాయి. ట్రిలియన్ స్థానాల వరకు పై విలువ కనుగొన్నారు. ఎంతో విశ్లేషణ జరిగింది. కాని 'పై' విలువలో వచ్చే అనంతమైన అంకెల విధానంలో ఎటువంటి (simple pattern in the digits) సరళమైన అమరిక కనుగొన బడలేదు. 

π విలువను empirical గా కొలిచే విధానం ఇది - ఒక పెద్ద వృత్తాన్ని గీచి, దాని వ్యాసాన్ని, చుట్టుకొలతను కొలవాలి. చుట్టుకొలత విలువను వ్యాసం విలువతో భాగించాలి. ఆ వచ్చే విలువే π అవుతుంది. ఎంత పెద్ద వృత్తం గీసినా, లేదా ఎంత చిన్న వృత్తం గీసినా ఈ విలువ మారకూడదు. మరొక్క రేఖా గణిత విధానాన్ని ఆర్కిమెడీస్ కనుక్కొన్నాడు. r అనే అర్ధ వ్యాసంతో ఒక వృత్తాన్ని గీయాలి. ఆ వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఇందుకు వృత్తం లోపల సమ బహుభుజి (Inscribed regular polygon) ని గీసి, ఆ సమభుజి వైశాల్యాన్ని కనుగొనాలి. సమభుజి యొక్క భుజాలు ఎన్ని ఎక్కువగా ఉంటే వృత్తం యొక్క వైశాల్యం అంత నిర్దిష్టంగా వస్తుందన్నమాట. ఈ వృత్తం వైశాల్యం A అనుకొందాము. అదే వృత్తం అర్ధ వ్యాసం యొక్క వర్గం (దాని పొడవుకు సమానమైన సమ చతురస్రం యొక్క వైశాల్యం) r2 = B అనుకోండి. ఈ A మరియు B ల యొక్క నిష్పత్తి విలువ π అవుతుంది.

రేఖా గణితంతో సంబంధం లేకుండా π విలువను కేవలం పూర్తి గణిత విధానాలలో కూడా గణించవచ్చును. కాని వీటిలో చాలా విధానాలు అర్ధం చేసుకోవడానికి త్రికోణమితి, కలన గణితంలలోగణనీయమైన పరిజ్ఞానం కావలసి వస్తుంది. కాని కొన్ని సరళమైన పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గ్రెగరీ-లీబ్నిజ్ సిరీస్ .
ఈ సిరీస్ వ్రాయడానికి, లెక్కపెట్టడానికి అంత కష్టం కాదు గాని దాని ద్వారా π విలువ ఎందుకు వస్తుందనేది అంత తేలికగా అర్ధమయ్యే విషయం కాదు. అంతే కాకుండా, ఈ సిరీస్ చాలా నిదానంగా converge అవుతుంది. 300 terms దాకా వెళితే కూడా π విలువ రెండు దశాంశ స్థానాల వరకు కచ్చితంగా రాదు. ఈ లీబ్నిజ్ సిరీస్ ని మొదటిగా 15వ శతాబ్దానికి చెందిన మాధవ సంఘమాగ్రమ  కనుగొన్నారు. ఈయన ప్రసిద్ధ భారతదేశ ఖగోళ గణిత శాస్త్రవేత్త. వీరు లీబ్నిజ్ కంటే 300 సంవత్సరాలక్రితమే కనుగొన్నారు. కావున ఈ శ్రేణిని మాధవ - లీబ్నిజ్ సిరీస్ అనికూడా అంటారు.....

Thursday, 12 March 2020

computer shortcuts basics

Alt + F File menu options in current program
Alt + E Edit options in current program
F1 Universal help (for all programs)
Ctrl + A Select all text
Ctrl + X Cut selected item
Shift + Del Cut selected item
Ctrl + C Copy selected item
Ctrl + Ins Copy selected item
Ctrl + V Paste
Shift + Ins Paste
Home Go to beginning of current line
Ctrl + Home Go to beginning of document
End Go to end of current line
Ctrl + End Go to end of document
to beginning of line
Shift + End Highlight from current position to end of line
Ctrl + f Move one word to the left at a time
Ctrl + g Move one word to the right at a time


MICROSOFT® WINDOWS® SHORTCUT KEYS
Alt + Tab Switch between open applications
Alt +
Shift + Tab
Switch backwards between open
applications
Alt + Print
Screen
Create screen shot for current program
Ctrl + Alt + Del Reboot/Windows® task manager
Ctrl + Esc Bring up start menu
Alt + Esc Switch between applications on taskbar
F2 Rename selected icon
F3 Start find from desktop
F4 Open the drive selection when browsing
F5 Refresh contents
Alt + F4 Close current open program
Ctrl + F4 Close window in program
Ctrl + Plus
Key
Automatically adjust widths of all columns
in Windows Explorer
Alt + Enter Open properties window of selected icon
or program
Shift + F10 Simulate right-click on selected item
Shift + Del Delete programs/files permanently
Holding Shift
During Bootup
Boot safe mode or bypass system files
Holding Shift
During Bootup
When putting in an audio CD, will prevent
CD Player from playing


WINKEY SHORTCUTS
WINKEY + D Bring desktop to the top of other windows
WINKEY + M Minimize all windows
WINKEY +
SHIFT + M
Undo the minimize done by WINKEY + M
and WINKEY + D
WINKEY + E Open Microsoft Explorer
WINKEY + Tab Cycle through open programs on taskbar
WINKEY + F Display the Windows® Search/Find feature
WINKEY +
CTRL + F
Display the search for computers window
WINKEY + F1 Display the Microsoft® Windows® help
WINKEY + R Open the run window
WINKEY +
Pause /Break
Open the system properties window
WINKEY + U Open utility manager
WINKEY + L Lock the computer (Windows XP® & later)

Shift + Home Highlight from current position

WORD® SHORTCUT KEYS
Ctrl + A Select all contents of the page
Ctrl + B Bold highlighted selection
Ctrl + C Copy selected text
Ctrl + X Cut selected text
Ctrl + N Open new/blank document
Ctrl + O Open options
Ctrl + P Open the print window
Ctrl + F Open find box
Ctrl + I Italicize highlighted selection
Ctrl + K Insert link
Ctrl + U Underline highlighted selection
Ctrl + V Paste
Ctrl + Y Redo the last action performed
Ctrl + Z Undo last action
Ctrl + G Find and replace options
Ctrl + H Find and replace options
Ctrl + J Justify paragraph alignment
Ctrl + L Align selected text or line to the left
Ctrl + Q Align selected paragraph to the left
Ctrl + E Align selected text or line to the center
Ctrl + R Align selected text or line to the right
Ctrl + M Indent the paragraph
Ctrl + T Hanging indent
Ctrl + D Font options
Ctrl + Shift + F Change the font
Ctrl + Shift + > Increase selected font +1
Ctrl + ] Increase selected font +1
Ctrl + Shift + < Decrease selected font -1
Ctrl + [ Decrease selected font -1
Ctrl + Shift + * View or hide non printing characters
Ctrl + f Move one word to the left
Ctrl + g Move one word to the right
Ctrl + h Move to beginning of the line or paragraph
Ctrl + i Move to the end of the paragraph
Ctrl + Del Delete word to right of cursor
Ctrl + Backspace Delete word to left of cursor
Ctrl + End Move cursor to end of document
Ctrl + Home Move cursor to beginning of document
Ctrl + Space Reset highlighted text to default font
Ctrl + 1 Single-space lines
Ctrl + 2 Double-space lines
Ctrl + 5 1.5-line spacing
Ctrl + Alt + 1 Change text to heading 1
Ctrl + Alt + 2 Change text to heading 2
Ctrl + Alt + 3 Change text to heading 3
F1 Open help
Shift + F3 Change case of selected text
Shift + Insert Paste
F4 Repeat last action performed (Word 2000+)
F7 Spell check selected text and/or document
Shift + F7 Activate the thesaurus
F12 Save as
Ctrl + S Save
Shift + F12 Save
Alt + Shift + D Insert the current date
Alt + Shift + T Insert the current time
Ctrl + W Close document


EXCEL® SHORTCUT KEYS
F2 Edit the selected cell
F5 Go to a specific cell
F7 Spell check selected text and/or document
F11 Create chart
Ctrl + Shift + ; Enter the current time
Ctrl + ; Enter the current date
Alt + Shift + F1 Insert new worksheet
Shift + F3 Open the Excel® formula window
Shift + F5 Bring up search box
Ctrl + A Select all contents of worksheet
Ctrl + B Bold highlighted selection
Ctrl + I Italicize highlighted selection
Ctrl + C Copy selected text
Ctrl + V Paste
Ctrl + D Fill
Ctrl + K Insert link
Ctrl + F Open find and replace options
Ctrl + G Open go-to options
Ctrl + H Open find and replace options
Ctrl + U Underline highlighted selection
Ctrl + Y Underline selected text
Ctrl + 5 Strikethrough highlighted selection
Ctrl + O Open options
Ctrl + N Open new document
Ctrl + P Open print dialog box
Ctrl + S Save
Ctrl + Z Undo last action
Ctrl + F9 Minimize current window
Ctrl + F10 Maximize currently selected window
Ctrl + F6 Switch between open workbooks/windows
Ctrl + Page up
& Page Down
Move between Excel® worksheets in the
same document
Ctrl + Tab Move between two or more open Excel® files
Alt + = Create formula to sum all of above cells
Ctrl + ‘ Insert value of above cell into current cell
Ctrl + Shift + ! Format number in comma format
Ctrl + Shift + $ Format number in currency format
Ctrl + Shift + # Format number in date format
Ctrl + Shift + % Format number in percentage format
Ctrl + Shift + ^ Format number in scientific format
Ctrl + Shift + @ Format number in time format
Ctrl + g Move to next section of text
Ctrl + Space Select entire column
Shift + Space Select entire row
Ctrl + W Close document


OUTLOOK® SHORTCUT KEYS
Alt + S Send the email
Ctrl + C Copy selected text
Ctrl + X Cut selected text
Ctrl + P Open print dialog box
Ctrl + K Complete name/email typed in address bar
Ctrl + B Bold highlighted selection
Ctrl + I Italicize highlighted selection
Ctrl + U Underline highlighted selection
Ctrl + R Reply to an email
Ctrl + F Forward an email
Ctrl + N Create a new email
Ctrl + Shift + A Create a new appointment to your calendar
Ctrl + Shift + O Open the outbox
Ctrl + Shift + I Open the inbox
Ctrl + Shift + K Add a new task
Ctrl + Shift + C Create a new contact
Ctrl + Shift+ J Create a new journal entry

యజ్ఞోపవీత మహిమ , విశిష్టత

యజ్ఞోపవీత మహిమ 

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 

దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 

ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 

దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 

   వేదతత్త్వస్య సూచనాత్

తత్సూత్రముపవీతత్వాత్ 

బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 
అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని

 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’

 అనే మంత్రం చెబుతోంది.  

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 

ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 

‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!

మొదటి తంతువులో ఓంకారం,
 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 
మూడవ తంతులో నాగదేవత, 
నాలుగవ తంతువులో సోమదేవుత, 
ఐదవ తంతువులో పితృదేవతలు, 
ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 
ఏడవ తంతువులో వాయుదేవుడు, 
ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 
తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 

తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 
అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 

అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 
దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 

ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 

ఇదే యజ్ఞోపవీత మహిమ!

ఓం తత్సత్......
సర్వేజనా సుఖినోభవంతూ.......