జయ జయ జయహే భారతీ - జగమంత కోరు నీ సంస్కృతి ౹౹ 2 ౹౹
జీవజాతులకు అంతేలేదు - వైరుధ్యానికి తావేలేదు
ప్రకృతితో పెనవేసిన బంధం - పరస్పరమ్ము స్వయంపూరకం
ఇదేమి తంత్రం అదే విచిత్రం - ప్రాణికోటి ఆరాధన మంత్రం ౹౹ 2 ౹౹
అనాదిగా ఇది మనకు ప్రబోధం - పునాదిగా ప్రభవించిన వేదం *౹౹ జయ జయ జయహే ౹౹*
తల్లి వైభవం తలపున ఉంచి - సమర్పణమ్మును మనసున ఎంచి
ఒరిగిన వీరులు తెగిన కంఠములు - ఆజన్మాంతపు జీవన సమిధలు
పరచిన దారిలొ నడచిన సేనలు - పరిత్యజించెను సర్వసుఖమ్ములు ౹౹ 2 ౹౹
పుడమీ పుత్రుల బంధం చూసి - ప్రపంచమే ప్రణమిల్లెను మురిసి *౹౹ జయ జయ జయహే ౹౹*
ప్రతీ మొక్క ఒక వృక్షమవ్వగ - చుక్క చుక్క ఒక నదిగ మారగ
అరమరికల అంతరములు మరిచి - అంటరానితనమన్నది తుడిచి
పల్లె పల్లెలో ప్రతీ ఇంటిలో - సంఘమంత్రమే ప్రతిధ్వనించగ ౹౹ 2 ౹౹
పరమవైభవం తీరం చేరగ - పయనించెద మీ మేను నావగ *౹౹ జయ జయ జయహే ౹౹*
*గమనిక :-*
ఈ పాటతోపాటు ఆడియో ఫైల్ కూడా మీకు పంపుతున్నాము. శిబిర అపేక్షితులు అందరూ ఇది అభ్యాసం చేసి రావాలి. మన జిల్లా/ఖండ/నగర అభ్యాస వర్గలలో, బైఠకులలో దీనిని అభ్యాసం చేయాలి. నేరుగా ఆడియో ఫైల్ Play చేసి పాడుకోవచ్చు. వేరే ఇంకెవరో పాడించాల్సిన అవసరం లేదు. ఆడియో ఫైల్ అలాగ తయారు చేశారు. మైక్ ఉంటే ఇంకా బాగా వినబడుతుంది.
No comments:
Post a Comment