కరోనా వైరస్ ఒంట్లో చేరిన తర్వాత ఏమౌతుంది? అనే దానిపై ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ కీలక సమాచారాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..
1-3 రోజులు లక్షణాలు ఆరంభం
* మొదట్లో ముక్కు, గొంతు ద్వారా శ్వాసకోశ సమస్యల లక్షణాలు కనిపిస్తాయి.
* మొదటి రోజే కొద్దిగా జ్వరం వస్తుంది.
* మూడో రోజు నుంచి దగ్గు, గొంతు నొప్పి ప్రారంభంఅవుతాయి
వ్యాధి లక్షణాల దశ
శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన తర్వాత 14 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. అయితే... లక్షణాలు బహిర్గతం కావడానికి పట్టే సమయం సగటున 5 రోజులని చైనాలో పరిశోధనలో తేలింది.
బాధితుల్లో ఇలాంటి లక్షణాలు 80% మందిలో కనిపిస్తాయి
4-9 రోజులు ఊపిరితిత్తుల్లోకి
* వ్యాధికారక వైరస్ 3-4 రోజుల్లో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది
* 4-9 రోజులకు శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది
* 8-15 రోజుల వ్యవధిలో ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశముంది
వైరస్ బాధితుల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్లు 14%
8-15 రోజులు రక్తంలోకి చేరిక
* ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరుతుంది.
* వారం ముగిసేసరికి... విషతుల్యమై ప్రాణహాని స్థాయికి చేరుతుంది
ఐసీయూలో చేర్చాల్సిన అవసరం వస్తున్న వారు 5%
మూడో వారం అత్యంత కీలక దశ
* డిశ్ఛార్జి: సహజంగా 18-25 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు తగ్గి బాధితులు ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇలా సురక్షితంగా బయటపడుతున్న బాధితుల సంఖ్య 95% కంటే అధికమే.
* సాధారణంగా 15-22 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు ముదిరి బాధితులు చనిపోతున్నారు. ఇదీ ఇతరత్రా జబ్బులున్న వారిలోనే ఎక్కువ.. ఇప్పటివరకు ఇలాంటి మరణాల రేటు అత్యల్పంగా నమోదవుతోంది.
No comments:
Post a Comment